మహమ్మారి వైరస్ తెలంగాణలో ఊహించని రీతిలో పెరిగిపోతోంది. అనూహ్యంగా తెలంగాణలో ఏకంగా 500కు చేరువగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 6,526కి చేరగా, ఇప్పటివరకు వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 198కి చేరింది. ఈ కేసుల్లోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 329 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం పాజిటివ్ కేసులు 4,526కు చేరాయి. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారు 2,976 మంది. ఇప్పటివరకు 3,352 మంది డిశ్చార్జయ్యారు.
మరోవైపు ఇప్పటివరకు 50,569 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కేసులు అనూహ్యంగా పెరగడానికి కారణం టెస్టుల సంఖ్య పెంచడమే కారణమని తెలుస్తోంది. తాజాగా 50 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆ మేరకు పరీక్షలు చేస్తోంది. దీంతోపాటు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కూడా పరీక్షలకు అనుమతి ఇవ్వడంతో వైరస్ వెలుగులోకి వస్తోంది.