తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు కేవలం 5వేలలోపే టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టుల్లోనూ 2వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని అందరిలోనూ ఆందోళన నెలకొంది. మొత్తం గణాంకాలు చూస్తే అదే స్పష్టమవుతోంది.
తెలంగాణలో ఇప్పటివరకు 23312 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,545 కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో పాజిటివ్ రేట్ ప్రస్తుతం 20శాతం కన్నా ఎక్కువగా ఉంది. దీంతో వైరస్ వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
జూన్ 1 నాటికి తెలంగాణలో 2792 కేసులు మాత్రమే ఉండగా.. జూలై 4 నాటికి 22312కు చేరడం కలవరపెడుతోంది. కేవలం నెలరోజుల్లోనే కేసులు 10 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.