వరల్డ్ అప్డేట్: కేసుల్లో అమెరికా..మరణాల్లో ఇటలీ టాప్

Update: 2020-03-29 05:54 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అమెరికా - ఇటలీ - స్పెయిన్ - బ్రిటన్ దేశాలను కరోనా పట్టి పీడిస్తోంది. అమెరికాలో అయితే అల్లకల్లోలం నడుస్తోంది. వైరస్ బాధితులు రోజురోజుకు పెరుగుతుండడం.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.

ఇక యూరప్ దేశాల్లో కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్థిక మాంద్యం కోరల్లో దేశాలు చిక్కుకున్నాయి. ఇక అమెరికాలో కరోనా బాధిత రాష్ట్రాలను ఆదుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ 2 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 183 దేశాలకు కరోనా పాకింది. ప్రధానంగా యూరప్ - అమెరికా దేశాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి.  ఆదివారానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 6 లక్షలకు పైగా నమోదయ్యాయి.

ఇటలీలో నిన్న ఒక్కరోజే 969 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. స్పెయిన్ లో 24గంటల్లో 832 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5690కు చేరింది. ఇక తమను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని ఇటలీ ప్రధాని మిగతా యూరప్ దేశాలను కోరారు.


Tags:    

Similar News