ఏపీలో ఉన్నఫలంగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడు మెడికల్ కాలేజీలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగబోతూ ఉంది. ఇప్పటి వరకూ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి భారీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే అరకు కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విషయానికి వస్తే.. ప్రస్తుతం మచిలీపట్నం వేదికగా జిల్లా కేంద్రం ఉంది. ఇక పై విజయవాడ ప్రత్యేక జిల్లా కాబోతూ ఉంది. మచిలీపట్నం జిల్లా వేరు, విజయవాడ వేరే జిల్లా అవుతుంది. బహుశా విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాకు కృష్ణా జిల్లా పేరు వెళ్లవచ్చు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం అంతా కలిసి ఒక జిల్లాగా ఏర్పాడే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే మచిలీపట్నం ఎంపీ సీటు పరిధిలో ఉండే గన్నవరం విజయవాడకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో గన్నవరాన్ని విజయవాడ జిల్లాలోకి వేయాలనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ సీటు పరిధిలోని ప్రాంతం అంతా ఒక జిల్లాగా ఏర్పడనుంది. మెడికల్ కాలేజీ అయితే గురజాలలో ప్రారంభకావొచ్చు. కానీ నరసరావు పేట జిల్లా కేంద్రం అవుతుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
మరోవైపు అరకు కేంద్రంగా ప్రతిపాదనలో ఉన్న జిల్లాకు కూడా పాడేరును కేంద్రంగా ప్రకటించాలని అక్కడి వైసీపీ నేతలు అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీ అరకులో ఏర్పాటు అయినా జిల్లా కేంద్రంగా పాడేరు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రావొచ్చు.