కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ కు చెందిన ఓ ఔషధ సంస్థ టాబ్లెట్ ను రూపొందించింది. దీని ధర 63 రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఇటీవలే ఈ టాబ్లెట్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం లభించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోల్ను పిరావిర్ పేరుతో కరోనా వైరస్ కు విరుగుడుగా ఈ టాబ్లెట్ ను మార్కెట్లోకి తీసుకు రానున్నారు. ఈ టాబ్లెట్ ను హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ అనే ఔషధ సంస్థ రూపొందించింది. ఈ మాత్ర టీకాలకు ఏ మాత్రం తీసిపోకుండా పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన అన్ని క్లినికల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇప్పటికే మన దేశంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కు సంబంధించి ఈ టాబ్లెట్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని స్పష్టం చేశారు. వైరస్ ను అంతం చేయడం లో ఈ మోల్ను పిరావిర్ ఔషధం మరింత ఎక్కువ రేట్లు సామర్థ్యంతో పని చేస్తుందని క్లినికల్ పరీక్షల్లో తేలినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దీనిని నోటి ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ టాబ్లెట్ ను ఉత్పత్తి చేసిన ఆప్టిమస్ అనే ఔషధ సంస్థ హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే మార్కెట్లోకి టాబ్లెట్ ను విడుదల చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి... ఈ టాబ్లెట్ ఇటీవల డిసిజిఐ ఆమోదం పొందినట్లు తెలిపారు. సంస్థ నిర్వహించిన మూడు దశల క్లినికల్ ట్రైల్స్ లో ఉత్తమ ఫలితాలు వెలువడ్డాయి ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ పై ఈ టాబ్లెట్ అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసినట్లు చెప్పిన ఆయన... కొన్ని రోజుల వ్యవధిలోనే కరోనాను నయం చేస్తుందని పేర్కొన్నారు. వీటిని ప్యాకెట్లు అమ్ముతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక ప్యాకెట్ లో 40 మాత్రలు ఉండనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా 5 షీట్స్ ఉంటాయని పేర్కొన వారు... ఒక్కొక్క టాబ్లెట్ ధర 63 రూపాయలుగా నిర్ణయించినట్లు వివరించారు. ఈ టాబ్లెట్ ను రోజుకు రెండు చొప్పున చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన దాని ప్రకారం ఈ రోజు సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో కొత్త వేరియంట్ కు సంబంధించిన కేసులు 1270 ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో సుమారు 200కు పైగా మంది ఈ ఒక్క రోజులో చనిపోయినట్లు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రానున్న రోజుల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో కేసులు జీవనకాల గరిష్ఠానికి చేరుతాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా కూడా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ కేసులు ఐదు లక్షలు దాటినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా వైరస్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.