గుసగుస.. కేసీఆర్ మదిలో కొత్తమంత్రులు.!?

Update: 2019-07-20 04:30 GMT
తెలంగాణ అసెంబ్లీ వేదిక మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ అనే ప్రశ్న అందరి ఎమ్మెల్యేల నోట ప్రతిధ్వనించింది. కేసీఆర్ దీనిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పూర్తి స్థాయిలో పాలన కొనసాగుతుందని.. దేశమే మన దగ్గర నేర్చుకునేలా సంస్కరణలు చేయబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు తన మదిలోని కొత్త మంత్రుల పేర్లను దాదాపు ఖాయం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కేబినెట్ లో బలమైన కమ్మ సామాజికవర్గానికి ఒక్క మంత్రిపదవి కూడా లేదు. ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయిలో ఉండే వారికి ప్రాతినిధ్యం కల్పించడంపై కేసీఆర్ దృష్టిసారించారట.. అంతేకాదు.. హైదరాబాద్ లో ఉన్న బడా కమ్మ వారిని సంతృప్తి పరచడానికి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీరోల్ పోషించడానికి కమ్మ నేతను మంత్రివర్గంలోకి తీసుకోవడం కేసీఆర్ కు నిత్యవసరం. ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన పువ్వాడ అజయ్, ఓడిన మాజీ మంత్రి తుమ్మలలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వవచ్చనే చర్చ సాగుతోంది. కేసీఆర్ మొగ్గు మాత్రం తుమ్మలకేనని వినపడుతోంది.

ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో విలీనమైన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి మహిళా కోటాలో మంత్రి పదవి ఖాయమనుకుంటున్నారు. వీరితోపాటు ఒక ఎస్టీ కోటాను, ఇక ముదిరాజ్ కోటాలో జోగురామన్న, గంగుల కమలాకర్, మాదిగలకు అవకాశం ఇస్తే రసమయి బాలకిషన్, ఇక వీరందరితోపాటు కేటీఆర్, హరీష్ లు కూడా మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తున్నారు.

మరి ఈ లెక్కలన్నీ నిజం కావాలంటే ఆగస్టు లేదా దసరా వరకు కేసీఆర్ విస్తరించే కేబినెట్ తోనే మనకు స్పష్టమవుతుంది. అప్పటి వరకు అందరూ ఎదురుచూడాల్సిందే.

    
    
    

Tags:    

Similar News