ఏ దేశానికైనా పార్లమెంటు ఒక చిహ్నంలా భాసిల్లుతుంది. అంతకు మించి ఒక దేశం సర్వసత్తాక, సార్వభౌమాధికారం దేశమని చెప్పాలంటే అందరూ ముందు చూపించేది పార్లమెంటునే. దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూర్చునే సభ.. పార్లమెంటు. ప్రజలకు అవసరమైన చట్టాలను, దేశ క్షేమం కోసం చేసే చట్టాలకు వేదిక.. పార్లమెంటు. దేశ ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా పార్లమెంటు భాసిల్లుతోంది.
ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రూ.720 కోట్ల భారీ వ్యయంతో సెంట్రల్ విస్టా పేరుతో కొత్త పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రభుత్వం నిర్మించింది. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతమున్న పార్లమెంటు భవనం దేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉంది. ఈ క్రమంలో ఎన్నో చారిత్రక సంఘటనలకు నిలయంగా ఉంది. ఉగ్రవాదుల దాడులకు సైతం గురయింది.
ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంటును త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న క్రమంలో పాత పార్లమెంటును ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంట్ భవనాన్ని బ్రిటిషర్లు నిర్మించారు. బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లూటెన్స్, హర్ బర్ట్ బేకర్ ఈ భవనానికి డిజైన్ చేశారు. దీన్ని నిర్మించేందుకు ఆరేళ్లు సమయం పట్టింది. ఈ భవనం 1927లో నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే అందరికీ సరిపోకపోవడంతో 1956లో మరో రెండు అంతస్తులను నిర్మించారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక స్వతంత్య్ర భారతదేశంలో తొలి పార్లమెంటు సమావేశం ప్రస్తుతమున్న భవనంలోనే జరగడం గమనార్హం. దేశానికి కీలకమైన భారత రాజ్యాంగాన్ని ఈ భవనంలోనే ఆమోదించారు.
మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఉద్ధండులు, పీవీ నరసింహారావులాంటి ఆర్థిక నిపుణుడు, అటల్ బిహారి వాజపేయి లాంటి మృదు స్వభావి ప్రధానులుగా ఈ పార్లమెంటు భవనంలోనే ఎన్నో కీలక సంస్కరణలకు తెరతీశారు.
ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2006లో పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 సంవత్సరాల నాటి భారతీయ విశిష్ట నాగరికత, సంస్కృతులు ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న పార్లమెంటును బ్రిటిషర్లు కౌన్సిల్ హౌజ్ అని పిలిచేవారు.
అయితే పాత పార్లమెంటు భవనాన్ని 1927లో నిర్మించడం, అది ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనానికి శ్రీకారం చుట్టింది.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో 60 వేల మంది కార్మికులు పనిచేశారు. రెండేళ్లపాటు దీని పనులు జరిగాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
కాగా కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైన తర్వాత, పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పాత పార్లమెంటు భవనం కూడా ఉనికిలోనే ఉండనుంది.