కరోనా బాధిత పిల్లల్లో కొత్త సమస్యలు.. గుర్తించిన గాంధీ ఆసుపత్రి

Update: 2022-01-13 05:59 GMT
గడిచిన కొద్ది రోజుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరగటం తెలిసిందే. ప్రస్తతం రోజుకు 1.9లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితి. సెకండ్ వేవ్ తో పోలిస్తే.. తాజా వేవ్ లో రోగ తీవ్రత తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రెండో వేవ్ లో విపరీతమైన జ్వరం.. జలుబు.. దగ్గు.. ఆయాసం లాంటి సమస్యలు ఉండేవి. అన్నింటికి మించి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులకు గురయ్యేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన సమస్యల్ని వైద్యులు గుర్తించారు.

పెద్దలతో పోలిస్తే.. పిల్లలు కరోనా బారిన పడింది తక్కువే అయినా.. వారికి సంబంధించి ఇప్పటివరకు ఎదురుకాని కొత్త ఆరోగ్య సమస్యల్ని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఇటీవల కరోనా బారిన పడి.. వైద్యం కోసం చేరిన పిల్లల్లో కడుపునొప్పి రావటాన్ని గుర్తించారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో కడుపునొప్పి అన్నంతనే.. అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతుంటే.. మరికొందరు మాత్రం డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి పరీక్ష చేస్తే.. వారిలో కరోనా పాజిటివ్ గా తేలుతోంది.

పెద్దలతో పోలిస్తే.. పిల్లలు కరోనా బారిన పడుతున్న ఉదంతాలు తక్కువే అయినా.. కొందరిలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో ఐదుగురు చిన్నారులు కరోనా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్  చికిత్సను అందిస్తున్నారు.

అందరిలో ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి.. 101-102 డిగ్రీలజ్వరం.. కడుపులో నొప్పి.. వాంతులు.. విరేచనాలు లాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా పిల్లలు కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే పరీక్ష చేయించాలని చెబుతున్నారు. ఇదో కొత్త లక్షణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News