నలభై ఏళ్ల క్రితం కానీ పుట్టి ఉంటే..రాత్రిళ్లు ఊళ్లల్లో ఆరుబయటో.. మిద్దెల మీద పడుకునే అద్భుత అవకాశం ఉండేది. చీకట్లో.. చాప మీదో.. మంచం మీదనో పడుకొని పైకి చూస్తే రాశులు పోసినట్లుగా నక్షత్రాలు. ఏదో మాట్లాడుతున్నట్లు.. మరేదో చెబుతున్నట్లు కనిపిస్తుండేవి. ఇప్పుడా రోజులన్నీ మాయమయ్యాయి. కాంక్రీట్ జంగిల్ లో.. రాత్రిళ్లు ఆకాశం వంక చూసే అవకాశమే మిస్ అయ్యింది. ఒకవేళ.. తలెత్తి చూసినా.. కాలుష్యపు కారు మబ్బులు దట్టంగా కమ్మేసి చుక్కలు కనిపించటం తగ్గిపోయింది.
అలా కంటికి కనిపించే నక్షత్ర మండలంలోకి అంతరిక్ష నౌకల్ని పంపటం మనకు అలవాటే. మరి.. మనం ఉన్న సౌరమండలానికి అవతలకు వ్యోమనౌకను పంపితే? అన్న కుతూహలం మనిషిని ఎప్పటి నుంచో వెంటాడుతోంది. అయితే.. ఆ ప్రయోగానికి అయ్యే ఖర్చు ఎక్కువ. పైగా అంత సాంకేతికత అందుబాటులోకి రాలేదు. అలాంటి రోజు కోసం ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేశాయి. తొలిసారి వేరే నక్షత్ర మండలాల్లో ఏముందో తెలుసుకునే ప్రాజెక్టు సిద్ధమైంది. దీనికయ్యే భారీ ఖర్చును భరించటానికి ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓకే అనేశాడు. ఇలాంటి ప్రాజెక్టుకు దన్నుగా నిలిచేందుకు విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సిద్ధమయ్యారు.
పది కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్వహించనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక బుల్లి వ్యోమనౌకను 'అల్ఫా సెంచోరై'(సూర్యడికి పొరుగు నక్షత్ర మండలం)కి పంపటానికి రంగం సిద్ధం చేశారు. దీన్ని చేరుకోవాలంటే భూమి నుంచి ప్రయోగించే వ్యోమనౌక ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో తెలుసా? అక్షరాల 40 లక్షల కోట్ల కిలోమీటర్లు. మరి.. అంతదూరం ప్రయాణించటానికి మనకున్న సాంకేతికతతో 30 వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే.. చాలా చిన్న స్థాయిలో ఉండే వ్యోమనౌకను ప్రయోగిస్తున్నారు. దీని బరువు కొన్ని గ్రాములు మాత్రమే ఉండనుంది.
ఇలా ప్రయోగిస్తున్న ఈ వ్యోమనౌక లక్ష్యానికి చేరుకోవటానికి పట్టే సమయం 20 ఏళ్లుగా అంచనా వేస్తున్నారు. భూమి నుంచి ప్రయోగించే లేజర్కాంతి పుంజాల సాయంతో ముందుకు వెళ్లే ఈ బుల్లి వ్యోమనౌక గంటకు 13 కోట్ల మైళ్లు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించే ఈ నౌక 20 ఏళ్ల తర్వాత వేరే నక్షత్ర మండలాలకు చేరుకుంటుంది.
ఇంత కష్టపడి చేసే ప్రయోగం ఎందుకంటే.. భూమి లాంటి గ్రహం ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఉంటుందన్న ఆశే. దాన్ని గుర్తించేందుకు ఈ అపురూప ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు.