ఏకపక్షంగా సాగినట్లుగా వార్తలు వస్తున్న బద్వేల్ ఉప ఎన్నికల వేళ.. సరికొత్త సన్నివేశం కనిపించింది. ఏపీలో అంత బలం లేని బీజేపీకి చెందిన అభ్యర్థి బరిలో ఉండటం.. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ సంప్రదాయం పేరుతో ఉప పోరులో పాలు పంచుకోకపోవటం తెలిసిందే. జనసేన సైతం టీడీపీ బాటలో నడిచి.. తాము కూడా ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఈ రెండు పార్టీలకు పట్టిన సంప్రదాయం.. బీజేపీకి పట్టకపోవటం గమనార్హం. ఉప పోరులో నిలిచిన బీజేపీకి ఉన్న బలం ఎంతన్నది అందరికి తెలిసిందే.
ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఆ పార్టీకి ఉన్న నేతలు.. కార్యకర్తల బలం అంతంతమాత్రమే. పోటీ నుంచి తప్పుకున్నట్లే తప్పుకున్న టీడీపీ.. పోలింగ్ వేళ మాత్రం బీజేపీ అభ్యర్థికి దన్నుగా పోలింగ్ ఏజెంట్లుగా నిలవటం ఆసక్తికరంగా మారింది. బద్వేల్ ఉప ఎన్నికల్లో నాన్ లోకల్ అయిన పణతల సురేష్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అతనికి స్థానికంగా బలం లేకపోవటంతో.. టీడీపీ నుంచి సహాయ సహకారాలు అందుకున్న పరిస్థితి.
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా.. టీడీపీ నేతలతో ఒప్పందాలు కుదుర్చుకుననారు. దీంతో టీడీపీ నేతలు.. కార్యకర్తలు శనివారం జరిగిన పోలింగ్ లో ఏజెంట్ల అవతారాన్ని ఎత్తారు. నియోజకవర్గం మొత్తం281 పోలింగ్ బూత్ లు ఉండగా.. పది బూత్ లలోనే బీజేపీ ఏజెంట్లు ఉంటే.. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు.. కార్యకర్తలు బీజేపీ ఏజెంట్లుగా అవతారం ఎత్తటం గమనార్హం. ఈ తీరు స్థానికంగా కొత్త చర్చకు తెర తీసింది.