న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన అమరావతి మహారైతుల పాదయాత్రలో కొత్త సీన్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ పాదయాత్ర టీడీపీకి చెందిన వారే చేస్తున్నారని.. అందులోని అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని ఏపీ అధికార పక్ష నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు వాస్తవానికి ఏ మాత్రం పొంతన లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పాదయాత్రను పరిశీలించేందుకు హైదరాబాద్ కు చెందిన కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్లి చూసొచ్చిన వారు.. విస్మయానికి గురి చేసే విషయాల్ని చెబుతున్నారు.
పాదయాత్ర సొంతంగా అమరావతిరైతులే చేస్తున్నారని.. వారు చేస్తున్న పాదయాత్రను.. దానికి వచ్చే మైలేజీని హైజాక్ చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని.. కానీ వారు అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఆ మాత్రం మైలేజీ కోరుకోవటం ఎవరైనా చేస్తారని.. కానీ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రం దారుణంగా డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు. దీనికి కారణం.. అందరికి తెలిసిన నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా అభివర్ణించే ప్రయత్నం తర్వాతి కాలంలో వారిని దెబ్బ తీసే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రిఅమిత్ షా తమ పార్టీ నేతలతో భేటీ అయిన సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు ఏపీ పార్టీ నేతలు ఎందుకు సంఘీభావం తెలపలేదని.. వారితో ఎందుకు కలవలేదన్న ప్రశ్నను సంధించటం.. ఈ సందర్భంగా ఏపీ బీజేపీలో చక్రం తిప్పే నేతలకు తలంటిన వైనం తెలిసిందే. అమిత్ షా క్లాస్ పీకిన రోజు తర్వాత.. సరైన సమయంలో మహాపాదయాత్రలో ఏపీ బీజేపీ పాలు పంచుకుంటుందని.. వారికి సంఘీభావం తెలుపుతున్నట్లుగా చెప్పటం ద్వారా అమిత్ షా మాటల ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా విడవకుండా కురుస్తున్న వర్షం మహాపాదయాత్రలో పాలు పంచుకుంటున్న వారికి కొత్త కష్టాల్ని.. ఇబ్బందులకు గురి చేస్తోంది. అయినప్పటికీ విడవని వారు.. గొడుగులు వేసుకొని మరీ పాదయాత్ర చేస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇవాల్టికి పాదయాత్ర మొదలై 22 రోజులు అవుతోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాదయాత్ర వర్షం కారణంగా నెమ్మదిగా సాగుతోంది. షెడ్యూల్ కు కాస్త తేడాగా నడుస్తున్న ఈ పాదయాత్రలో.. వాన కారణంగా ఎదురవుతున్న ప్రతికూలతల్ని అధిగమించి మరీ నడుస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది.
మహాపాదయాత్రకు అపూర్వ స్పందన లభించటం.. ప్రతి గ్రామంలోనూ ప్రజలు తమంతట తాము ముందుకు వచ్చి హారతులు ఇవ్వటం.. స్వాగతం పలకటం లాంటివి చేయటమే కాదు.. వారికి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహాపాదయాత్రలో బీజేపీ ఎంపీలైన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లతో పాటు మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేయనున్న సీన్ చూస్తే...కొత్త సమీకరణాలకు తెర తీయనుందని చెప్పక తప్పదు. షానా మజాకానా?