సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్.. స్పందించిన దేశం!

Update: 2021-05-19 06:31 GMT
సెకండ్ వేవ్ మ‌న దేశాన్ని నాశ‌నం చేసినంత‌గా.. మ‌రే దేశంపైనా ప్ర‌భావం చూపించ‌లేదు. నిత్యం ల‌క్ష‌లాది కేసులు.. వేలాది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఆ దారుణ మార‌ణ‌హోమం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికే నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న వేళ‌.. థ‌ర్డ్ వేవ్ వార్త‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపే స‌రికొత్త స్ట్రెయిన్ సింగ‌పూర్ లో వెలుగు చూసిందంటూ వ‌చ్చిన వార్త‌లు అల‌జ‌డి సృష్టించాయి.

ఈ విష‌య‌మై ఢిల్లీ ముఖ్య‌మంత్రి క్రేజీవాల్ కేంద్రాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. సింగ‌పూర్ లో కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన నేప‌థ్యంలో.. ఆ దేశానికి విమాన స‌ర్వీసులు నిలిపేయాల‌ని, అక్క‌డి నుంచి వ‌చ్చే విమానాల‌ను కూడా అడ్డుకోవాల‌ని కోరారు. సింగ‌పూర్ వేరియంట్ వ‌ల్ల థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

అయితే.. ఈ వార్త‌ల‌పై సింగ‌పూర్ స్పందించింది. త‌మ దేశంలో కొత్త స్ట్రెయిన్ లేద‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. భార‌త మీడియాలో వ‌చ్చిన వార్త‌లు నిజం కాద‌ని చెప్పింది. బీ.1.617.2 వేరియంట్ వెలుగు చూసింద‌ని, దాన్ని ప‌రీక్షిస్తే.. దేశంలోని చాలా క్ల‌స్ట‌ర్ల‌లో ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఇది కొత్త స్ట్రెయిన్ కాద‌ని చెప్పింది. కాగా.. ఈ వేరియంట్ నేప‌త్యంలో అక్క‌డి పాఠ‌శాల‌ల‌ను ఈ నెల 28 వ‌ర‌కు మూసివేయడం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News