పందెం రాయుళ్ల కొత్త ట్రెండ్..

Update: 2019-04-25 07:31 GMT
పందెం రాయుళ్లు రూటు మార్చారు. సరికొత్త పందాలకు దిగుతున్నారు. మొన్నటి వరకూ అసెంబ్లీ నియోజకవర్గ వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులపై పందాలు కాసిన వారు ఇప్పుడు ఫలానా గ్రామం నుంచి వైసీపీ, టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుంది? ఒక్క ఓటు అయినా అధికంగా వస్తుందంటూ పందాలు కాస్తున్నారు.

తాజాగా మైలవరం నియోజకవర్గంపై అత్యధికంగా పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి దేవినేని ఉమ, వైసీపీ నుంచి వసంత వెంకటకృష్ణ బరిలో ఉన్నారు. వీరిద్దరి మెజారిటీపై పందాలు కాసిన వారు ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మెజార్టీపై పందాలు కాస్తున్నారు. ఆయా గ్రామాల్లో డబ్బు పంపకం, గతంలో వచ్చిన మెజారిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు పందాలు కాస్తున్నారు.

ఇక మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా ఎన్నికల వేళ పందాల బ్రోకర్లుగా మారారు. ఫలానా చోట ఫలానా పందెం ఉందని పందెం రాయుళ్లకు ఫోన్లు చేసి బెట్టింగ్ కాపిస్తున్నారు. పందెపు రాయుళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఇలా మధ్యవర్తులు కూడా 10 నుంచి 15శాతం కమీషన్ తీసుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు.

ఇక చిన్న తిరుపతి నుంచి వచ్చిన కొందరు పందెపు రాయుళ్లు అయితే ఏకంగా రాష్ట్రంలో వైసీపీకి ఒక సీటు అధికంగా వస్తుందని ఏకంగా 20 లక్షలు పందెం కాయడం విశేషం. ప్రధానంగా ఒక్క ఓటు తేడాతో గెలుపు.. ఒక్క సీటు అధికంపైనే పందెపు రాయుళ్లు తాజాగా బెట్టింగ్ లు నిర్వహించడం కొత్త ట్రెండ్ గా మారింది.
Tags:    

Similar News