లక్నో కి‘లేడీ’: మొన్న క్యాబ్ డ్రైవర్ పై దాడి.. ఇప్పుడు పోలీసులకే ‘పంచ్’
ఎలాంటి తప్పు చేయకున్నా.. అడ్డగోలు వాదనతో నడిరోడ్డు మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించిన లక్నో కి‘లేడీ’ (సీసీ ఫుటేజ్ లో ఆమె విపరీత చర్యల నేపథ్యంలో ఇలా రాయక తప్పట్లేదు) ఉదంతంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ట్రాఫిక్ బాగా ఉన్న రోడ్డు మీద.. రెడ్ సిగ్నల్ పడక ముందు రోడ్డు దాటే ప్రయత్నం చేయటం ఒక తప్పు అయితే.. అడ్డదిడ్డంగా నడుస్తూ రోడ్డు మీద వాహనదారులకు చుక్కలు చూపించేటోళ్లు చాలామందే ఉంటారు. కానీ.. తప్పు చేయని క్యాబ్ డ్రైవర్ మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. ఏకంగా 22 సార్లు దెబ్బలు కొట్టిన ఈ మహిళను ఏమనాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
సాధారణంగా ఎవరైనా మహిళ ఫిర్యాదు చేసినా.. తనకు అన్యాయం జరిగందని చెప్పినంతనే.. అందరూ ఆమె వైపు మాట్లాడటం ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. దాన్నో అడ్వాంటేజ్ గా తీసుకొని రోడ్డు మీద రెచ్చిపోయిన లక్నో అమ్మాయి తీరును పలువురు తప్పు పడుతున్నారు. తొలుత క్యాబ్ డ్రైవర్ తప్పు చేశాడని అనుకున్నా.. సీసీ ఫుటేజ్ బయటకు రావటం.. అందులో సదరు క్యాబ్ డ్రైవర్ ది ఎలాంటి తప్పు లేదని తేలటంతో.. సదరు అమ్మాయి మీద అందరూ ఫైర్ అవుతున్నారు.
సదరు అమ్మాయి మీద కేసు నమోదు చేయాలని.. అరెస్టు చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘అరెస్టు లక్నో గర్ల్’ అంటూ పెద్ద ఉద్యమం ఆన్ లైన్ వేదికగా చేసుకొని నడుస్తోంది. దీనికి తోడు అన్యాయంగా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి.. ఒక రోజంతా స్టేషన్ లోనే ఉంచేసిన వైనంపైనా విమర్శలు రేగుతున్నాయి. ఈ కేసు ఉదంతంపై ఒత్తిడి పెరగటంతో.. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటారన్న ఆరాను తీస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. ఈ లక్నో గర్ల్ తాజాగా తన తీరుతో మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించింది.
ఈసారి ఆమె నోటికి పోలీసులు బలైపోయిన పరిస్థితి. నడిరోడ్డు మీద ఆమె చేసిన డ్రామాపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న వేళలో..ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇంటికి వెళ్లారు. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. పోలీసులు తమ వద్దకు వచ్చారని.. తన కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తనపై మోపిన ఆరోపణలు ఉత్తవేనని.. తాను ఊరికే కొట్టలేదు.. తన ఆత్మరక్షణ కోసం మాత్రమే కొట్టాల్సి వచ్చిందన్నారు. ఆమె మాటలు విన్నవారంతా విస్మయానికి గురవుతున్నారు. ఓవైపు.. తనకు తాను కదిలించుకొని కారు డ్రైవర్ ను కారు లో నుంచి బయటకు లాగి.. అతగాడి సెల్ ఫోన్ పగలకొట్టి.. 22 సార్లు దెబ్బలు కొట్టిన వైనం కూడా ఆత్మరక్షణే అవుతుందా? సంబంధం లేని వాదనల్ని వినిపిస్తూ.. పోలీసులకే పంచ్ ఇచ్చిన ఆమె వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా లక్నో ‘‘కి’లేడీ’ నైజాన్ని గుర్తించి పోలీసులు ఆమెను సరైన రీతిలో డీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. మరేం చేస్తారో చూడాలి.

CCTV से ऐसा लग रहा है कि ये लड़की इस गरीब टैक्सी चालक को इतनी बुरी तरह से पीट रही है क्यूंकि उसने गाड़ी नहीं रोकी! ये बेहद शर्मनाक है. किसने अधिकार दिया इस लड़की को मारपीट करने का? इस मामले में @Uppolice जांच करे और कानून को हाथ में लेने के अपराध में महिला पर कड़ी कार्यवाही हो. pic.twitter.com/IrVUKkeINC
— Swati Maliwal (@SwatiJaiHind) August 2, 2021