ప్రపంచ స్థితిగతులను మార్చిన కరోనా కేసులు ప్రస్తుతం పెరగకపోయినా కొత్త వేరియంట్ల ద్వారా చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో వైరస్ సబ్ వేరియంట్లను సృష్టించుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి బీ 2, బీఏ 4 వేరియంట్లు వచ్చాయి. తాజాగా బీఏ 5 విస్తరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. బీఏ 2, బీఏ4 వేరియంట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. బీఏ 5తో రీ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని అందోళన వ్యక్తమవుతోంది. దీంతో భవిష్యత్ లో కొవిడ్ మరెన్ని రూపాలు సంతరించుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. అయితే వైద్య శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కొందరు సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు వరకు వచ్చిన కొవిడ్ వేరియంట్లలో అనేక ఉపకరణాలకు దారి తీశాయి. గతంలో ప్రాణాలు బలితీసుకున్న డెల్టా వైరస్ లోనూ అనేక ఉపకరణాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఒమిక్రాన్ అంతకంటే ఎక్కువ రూపాంతరం చెందుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి బీఏ 1, బీఏ 2 కొనసాగాయి. ఇప్పుుడు వాటి జాబితాలో బీఏ 1.1, బీఏ 3, బీఏ 4, బీఏ 5 కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్ మిగతా వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో కొత్త ఉపకరణాలు పొట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఒక వేరియంట్ గణనీయ స్థాయిలోకి వెళ్లినప్పుడు దాని నుంచి భిన్న ఉపకరణాలు అనేకంగా వస్తాయి. అయితే వీటితో పెద్దగా ఇబ్బందులు ఉండవని అంటున్నారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చే ఉపకరణాలపై అంచనా వేయలేమని చెబుతున్నారు.
వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా వైరస్ కొత్త ఉపకరణాలు పుట్టుకొస్తున్నాయి. ఇది రెండు రకాలుగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న మానవుల్లో దీని వ్యాప్తి వేగం అవుతుంది. మరోవైపు జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కరోనా వైరస్ స్వల్ప కాలంలోనూ శరవేగంగా ఉత్పరివర్తన చెందే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో సాధారణం కంటే ఎక్కువగా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వైరస్ కొత్త ఉపకరణాలను సృష్టించుకుంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా విస్తరించడానికి ఉపకరణాలు మాత్రమే కాదు. రీ కాంబినేషన్ అనే వ్యూహం ద్వారా కూడా కొత్త వైరస్ లు పుట్టుకొచ్చే ప్రమాదాలున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ ల మధ్య ఇలాంటి మిశ్రమం జరిగి అధిక ఇన్ఫెక్షన్లు కలిగేందుకు కారణమయ్యాయి. అయితే భవిష్యత్ లోనూ ఇలాంటి కాంబినేషన్ల ద్వారా కొత్త వైరస్ పుట్టుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒక వ్యక్తి బీఏ 1, బీఏ 2 రకాల ఇన్ఫెక్షన్ తో ఉన్నాడని చెప్పినా.. అతని ద్వారా కొత్త వైరస్ పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఇప్పటి వరకు బయటపడలేదని అంటున్నారు.
అయితే ఒమిక్రాన్ బీఏ 5 వల్ల మనుషులు రీ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదాలు లేకపోలేదని అంటున్నారు. గతంలో బీఏ 1 లేదా ఇతర ఉపకరణాల బారినపడి కోలుకున్న వారికీ బీఏ 5 సోకేప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకున్నవారు సైతం బీఏ 5 కి బాధితులుగాల మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వచ్చే కొద్ది వారాల్లో కేసుల పెరుగుదలను భట్టి దీనిని నిర్దారించవచ్చు. అయితే మూడో టీకాతో ఒమిక్రాన్ తీవ్రతను అడ్డుకోవచ్చని పరిశోధనలు తేలాయని వైద్య శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.