ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొదటి కరోనా పాజిటివ్ రోగి కోలుకున్నాడు. ఇది ఏపీలో ఊరటనిచ్చింది. విశాఖపట్నంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో నలుగురికి కరోనా పాజిటివ్ రాగా.. నగరంలో నమోదైన మొదటి కరోనా రోగి వ్యాధి నయమైంది. తాజాగా జరిపిన పరీక్షల్లో అతడికి నెగెటివ్ అని తేలింది.
ఇక పూర్తిగా నిర్ధారణ కోసం ఫూణెలోని నేషనల్ వైరాలజీ డిపార్ట్ మెంట్ కు ఇతడి రక్తనమూనాలు పంపారు. అక్కడ కూడా నెగెటివ్ అని తేలితే అతడిని డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండమని కోరుతారు.
ఇప్పటికే ఏపీలో నెల్లూరు లో నమోదైన ఒక కరోనా రోగికి నయమై డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఈ లెక్కన ఏపీలో కోలుకున్న రెండో బాధితుడు విశాఖ వాసి.
ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కరోనా సోకిన రోగుల సంఖ్య 19కి చేరింది. కొత్తగా నమోదైన 23 అనుమానిత కేసులు నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చాయి. తెలంగాణలో కేసులు 67కు చేరుకున్నాయి.