భారత్ లోనూ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసులపై తాజాగా బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క బులిటెన్ విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు పెరగడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి 1965కు చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్క రోజులోనే ఏకంగా కొత్తగా 437 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో - భారతదేశంలో 437 కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీ మర్కాజ్ ప్రార్థనలతో గురువారం మరిన్ని వెలుగుచూడడం ఖాయమంటున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. వైరస్ నుంచి 151 మంది మాత్రమే కోలుకున్నారు.
ఇవి ప్రభుత్వ ఆరోగ్య బులెటిన్ నుంచి వచ్చిన అధికారిక గణాంకాలు మాత్రమే.. అయితే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. బుధవారం రాత్రి నాటికే దేశంలో కరోనా రోగుల సంఖ్య 2000 దాటడం ఆందోళనకు గురిచేస్తోంది.
బుధవారం నమోదైన సానుకూల కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో జరిగిన మార్కాజీ సమావేశానికి హాజరైన వారే కావడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీరికే కరోనా పాజిటివ్ గా తేలుతోంది. నిజాముద్దీన్ లో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరయ్యేవారిని - వారి కుటుంబాలను గుర్తించి క్వారంటైన్ లో ఉంచడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెతకడం ఆరంభించాయి.