ఏపీలో స్ట్రెయిన్‌ వైరస్ ..బ్రిటన్ రిటర్న్స్ లో 11మందికి పాజిటివ్ !

Update: 2020-12-29 09:40 GMT
బ్రిటన్‌ లో ప్రారంభమైన కొత్త కరోనా వైరస్..అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఆందోళన రేపుతోంది. దీనికి కారణం యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడమే. అయితే వీరిలో ఎంతమందిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో కలవరం రేపింది. ఇక ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ భయం ఏపీని తాకింది. యూకే నుంచి వచ్చినవారిలో 11 మందికి కరోనా పాజిటివ్ తేలింది. వారి కాంటాక్ట్స్ లో 12 మందికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఏపీ లో మొత్తం 23మంది యూకే స్ట్రైన్ అనుమానితులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

స్ట్రెయిన్ ‌ను గుర్తించేందుకు శాంపిల్స్‌ ను ల్యాబ్స్‌ కు పంపించారు. మరోవైపు ఏపీలో మరో కొత్తరకం వేరియంట్‌ N440K ఆందోళన నెలకొంది. 232 శాంపిల్స్‌ లో 34మందిలో కొత్త వైరస్‌ ను గుర్తించారు. ఇక బ్రిటన్‌ లో న్యూ స్ట్రెయిన్ కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్‌ కూడా సరిపోవడం లేదు. దీంతో యూకేలోని అన్ని ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి సాధారణ సేవలు నిలిపివేసి..కేవలం కరోనా బాధితులకే చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ కొత్త మ్యుటేషన్‌తో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రజలు, ప్రభుత్వం. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన న్యూ స్ట్రెయిన్‌తో మరణాల ముప్పు పెరుగుతుందని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక ఈ కొత్త వైరస్‌ ప్రపంచ దేశాలకూ విస్తరిస్తూ అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ఇప్పటివరకూ డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, స్వీడన్ తదితర దేశాల్లో 'బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా'ను గుర్తించారు.


Tags:    

Similar News