కరోనా సెకండ్ వేవ్.. ఒమిక్రాన్ రాక.. ఇలా 2021 ముగిసింది. ఇక రేపటి నుంచి కొత్త ఏడాది రాబోతుంది. 2020 లో వచ్చిన కరోనా మహమ్మారి చాలా ఆరోగ్య స్పృహను కలిగించింది. ఎంతోమంది పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేస్తారు. అలాంటివారికి ఆరోగ్యమే మహా భాగ్యమనే విషయాన్ని వైరస్ మళ్లీ గుర్తు చేసింది. అయినా కొందరి తీరులో మార్పు రాలేదు. ఈ ఏడాదిలో అయినా హెల్త్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి. రేపటి నుంచి మీ దినచర్యలో ఇవి మార్చుకోండి. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తో ఇక ఆరోగ్యం... ఆనందం మీ సొంతం.
ఉదయాన్నే లేవడం... పనులు చేసుకోవడం... విధులకు వెళ్లడం. రాత్రి రాగానే పనులు చేయడం... నిద్రకు ఉపక్రమించడం. ఇక ఇంటి నుంచి పని చేసేవారి సంగతి సరేసరి. వారికి నచ్చినప్పుడు తినడం, నచ్చినప్పుడు పనిచేయడం. జీవితం సాఫీగా సాగుతుంది అనిపిస్తుంటుంది. అసలు సమస్య అక్కడే వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఓ చిన్న సమస్యలు తలెత్తి... ఆపై ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజూ వీలైనంత సేపు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. పైగా ఫిట్ గా ఉంటారు. ఎక్సర్ సైజ్ శరీరానికి చాలా అవసరం.
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. పిల్లలు పెద్దలు తేడా లేకుండా విపరీతంగా ఫోన్లు చూసేస్తున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అది కాస్త ఎక్కువైంది. ఫలితంగా నిద్రలేమి సమస్య తలెస్తుతోంది. చాలామంది లేట్ నైటే వరకు బ్రౌజింగ్ చేయడం, చాటింగ్ వంటివి చేస్తున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని ప్రభావం కొన్ని రోజుల తర్వాత ఆరోగ్య వ్యవస్థపై పడుతుంది. కాబట్టి ఫోన్లకు దూరంగా ఉంటూ... సరిపడ నిద్ర పోవాలి. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనకు సరిపడినంత సేపు నిద్రపోతోనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.
కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య స్పృహ చాలావరకు పెరిగింది. అయితే పని ఒత్తిడి వల్ల కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారు కూడా హెల్త్ పై కాస్త ఫోకస్ చేయాలి. పనిలో పడి నీరు తాగడాన్ని మర్చిపోయేవారు చాలామంది ఉంటారు. కంపల్సరీ గా నీటిని ఎక్కువగా తాగాలి. కొంత సమయం కేటాయించుకుని కొద్దికొద్దిగా నీటిని తీసుకోవాలి. నీరు మన శరీరానికి చాలా ముఖ్యం. దాదాపు జీవక్రియల్నింటికి నీరు చాలా అవసరం. కాబట్టి నీటిని ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇటీవల కాలంలో అల్పాహారాన్ని స్కిప్ చేసే వారు ఎక్కువవుతున్నారు. చాలామంది పనుల్లో పడి ఉదయం పూట ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. ఇక విధులకు వెళ్లేవారు సైతం ఉదయం ఏమీ తినకుండా వెళ్తున్నారు. అయితే అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. భోజనాన్ని కచ్చితంగా మూడు పూటలు తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. పని ఉంది కదా అని వాయిదా వేసి... ఆలస్యంగా తింటే దానితో లాభం ఉండకపోగా... నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన సమయానికి భోజనం చేయాలి.
పైన చెప్పినట్లు రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయాలి. మన శరీరానికి సరిపడినంత సేపు నిద్రపోవాలి. ఇక నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా కూడా భోజనాన్ని సరైన సమయానికి తీసుకోవాలి. ఈ విధంగా మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అమలు చేసుకొండి. ఇక ఆరోగ్యం... ఆనందం మీ సొంతం...!