సూయజ్ ​లో చిక్కుకున్న ఐపీఎల్​ క్రికెటర్​​..!

Update: 2021-03-31 01:30 GMT
న్యూజిలాండ్​ క్రికెటర్ నీషమ్‌ కు ఓ నెటిజన్​ కు ఆసక్తికరమైన సంభాషణ సాగింది. మధ్యలో ఆసీస్​ క్రికెటర్​ మ్యాక్స్​వెల్​ కూడా కౌంటర్​ ఇవ్వడంతో ఈ చర్చ మరింత రసకందాయంలో పడింది. ఏప్రిల్​ 9 నుంచి ఐపీఎల్​ 2021 జరగబోతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్​ జట్టుకు కీవిస్​ ఆటగాడు నీషమ్​ ఎంపికయ్యాడు. అయితే నీషమ్​ ను ఆ ట్విట్టర్​ లో ఓ నెటిజన్​ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ‘ఏంటి నీషమ్​ ఐపీఎల్​ కు ఎప్పుడొస్తున్నావు’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నీషమ్​ తనదైన స్టయిల్​ లో వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. ’నేను ఐపీఎల్​ కు రావాలని రెడీ అయ్యాను. కానీ సూయజ్​ కాల్వలో చిక్కుకున్నా అందుకే ఎప్పుడొస్తున్నానో.. తెలియదు’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పాడు.

ఇటీవల సూయజ్​ కాల్వలో ఓ భారీ పడవ ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో వేల కోట్ల రూపాయలు నష్టమైంది. చివరకు ఆ నౌకను విడిపించగలిగారు. అయితే నీషమ్​ పెట్టిన రిప్లై ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. మధ్యలో దూరిన మ్యాక్స్​వెల్​ అయితే నెటిజన్​కు.. నీషమ్​ కు ఆసక్తికరమైన సంభాషణ సాగుతుంటే.. ఆస్ట్రేలియా క్రికెటర్​ మ్యాక్స్​వెల్​ మధ్యలో దూరాడు. నీషమ్​ ను రెచ్చగొట్టేలా మరో రిప్లై ఇచ్చాడు. 'ఏంటి జేమ్స్​ నీషమ్​.. పడవలో నువ్వు మాత్రమే వస్తున్నావా... లేక 46, 44, 46 బరువులు కూడా మోసుకొస్తున్నావా? అంటూ ఓ కౌంటర్​ వేశాడు. తొలుత ఈ కౌంటర్​ ఎవరికీ అర్థం కాలేదు.

అసలు విషయం ఏమిటంటే ఇటీవల కీవిస్​ జట్టు .. ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్​లో జేమ్స్​ నీషమ్​ బౌలింగ్​ లో మ్యాక్స్ వెల్​ వరసగా 4,6,4,4,4,6 ప్రతి బాల్​ను బౌండరీగా లేదా సిక్సర్​గా మలిచాడు. నెటిజన్లకు అందుకే మ్యాక్స్​వెల్​ ఆ బరువులు అంటూ ఆ అంకెలు వేశాడని అర్థం చేసుకొని నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్​ షాట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాక్స్​వెల్ గత ఏడాది కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో 14.5 కోట్లకు అమ్ముడుపోయాడు మ్యాక్స్​వెల్​. కానీ ఏ మాత్రం ఫర్​ఫామెన్స్​ చూపించలేకపోయాడు. దీంతో పంజాబ్​ జట్టు అతడిని వదులుకున్నది. ప్రస్తుతం ఆర్​సీబీ కొనుగోలు చేసింది.


Tags:    

Similar News