ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి 49మందిని కాల్చేశాడు..

Update: 2019-03-15 10:40 GMT
న్యూజిలాండ్ లో దారుణం జరిగింది. శుక్రవారం కావడంతో క్రిస్ట్ చర్చ్, లీన్ వుడ్ మసీదుల్లో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలే లక్ష్యంగా  కరుడుగట్టిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 49కి చేరింది. దాదాపు 50మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ చనిపోయిన వారి సంఖ్యను ధ్రువీకరించారు.

న్యూజిలాండ్ కాలామనం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చిల్లో సాయుధలైన దుండగులు విచక్షిణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తూ గుమిగూడిన నేపథ్యంలో పక్కా ప్రణాళికతో దాడికి తెగబడ్డారని ప్రధాని ఆర్డెన్ వివరించారు. దాడికి పాల్పడిన నలుగురిని ఇప్పటికే భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రధాన నిందితుడు బ్రెంటన్ టారెంట్ (28)ది ఆస్ట్రేలియా అని పోలీసులు తేల్చారు. వారి వద్ద రెండు కారు బాంబులు లభించగా.. వాటిని రక్షణ శాఖ వర్గాలు నిర్వీర్యం చేశాయి.

మసీదుల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఆస్ట్రేలియాకు చెందిన దుండగుడు టారెంట్ దాన్ని ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాదాపు 17 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.  పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లకు ఫిర్యాదు చేసి ఆ వీడియోలను తొలగించారు.

శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ మండిపడ్డారు. హింసను ప్రేరేపిస్తే ఊరుకోమని.. కూకటి వేళ్లతో అణిచివేస్తామని.. ఇది చీకటి రోజని.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఆ వీడియోను షేర్ చేయొద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు.
    

Tags:    

Similar News