చిన‌బాబు.. నాలుగు రోజులు.. నాలుగు అడుగులు..!

Update: 2022-03-24 06:38 GMT
ఔను! టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారాలోకేష్ ఇమేజ్ పెరిగింది. ఈ మాట పార్టీల‌కు అతీతంగా ఉం డే.. మేధావులు సైతం అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబు హాజ‌రు కావ‌డం లేదు. దీంతో అటు అసెంబ్లీ స‌భ్యుల‌ను, ఇటు శాస‌న మండ‌లి స‌భ్యుల‌ను కూడా ముందుండి న‌డి పించే బాధ్య‌త‌ల‌ను లోకేష్ తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న క‌ల్తీ సారా మ‌ర‌ణాల విష‌యంలో ఆయ‌న స్పందించిన తీరు కు మంచి మార్కులు ప‌డ్డాయ‌ని చెబుతున్నారు.

నేరుగా బాధిత ప‌ప్రాంతాల‌కు వెళ్ల‌డం.. బాధితుల‌తో మ‌మేకం కావ‌డం.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా.. స‌భ‌లోనూ.. మండ‌లిలోనూ వాయిదా తీర్మానం ఇవ్వ‌డం.. చ‌ర్చ‌కు పట్టు ప‌ట్ట‌డం .. వంటివి లోకేష్‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను చాటి చెబుతున్నాయ‌ని అంటున్నారు. ఇక‌, బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించేందుకు ముందుగా ఆలోచ‌న చేసిన లోకేష్‌.. దానికి త‌గిన విధంగా వెంట‌నే నిధులు కూడా స‌మ‌కూర్చారు.

ఇక‌, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయడంలోనూ.. లోకేష్‌.. భేష్ అని అనిపించుకుంటున్నారు.. మ‌రోవైపు... పార్టీ ప‌రంగానూ.. లోకేష్ దూకుడుగా ఉన్నారు. గ‌డిచిన ఆరు మాసాల నుంచి ఆయ‌న ప్ర‌జాక్షే త్రంలోనే ఉండడాన్ని ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అన్ని అంశాల‌నూ.. ఆయ‌న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నార‌ని.. ఇది మంచి ప‌రిణామ‌మ‌ని .. సీనియ‌ర్లు కూడా చెబుతున్నారు. ``చాలా మంచి పార్టిసిపేష‌న్‌. గ‌తం సంగ‌తి ఏమో తెలియ‌దు కానీ...ఇప్పుడు మాత్రంఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో అన్ని విధాలాపార్టీ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ‌త ముందుకు వ‌స్తున్నారు. లోకేష్ నాయ‌క‌త్వానికి జైకొడుతున్నారు. ఇది మంచి ప‌రిణామం`` అని సీనియ‌ర్ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇలా.. లోకేష్ నాలుగు రోజుల్లోనే నాలుగు అడుగులు వేసి.. మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నార‌ని.. టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News