'చిరు' సంక‌ల్పం.. నెర‌వేర‌డం.. క‌ష్ట‌మేమీ కాదు.. కానీ!

Update: 2022-10-05 02:30 GMT
ఔను.. మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తం చేసిన‌.. సంక‌ల్పం.. నిజ‌స్వ‌రూపం దాల్చ‌డానికి పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అంటున్నారు మెగా అభిమానులు. తాజాగా చిరు చేసిన వ్యాఖ్య‌ల‌పై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ``భ‌విష్య‌త్తులో రావాల‌నే అనుకుంటున్నాను. రావాలి కూడా.

నిస్వార్థంగా ఉన్న‌వారికి ప్ర‌జ‌లు అవ‌కాశం ఇవ్వాలి కూడా`` అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంటే.. దాని అర్థం.. ప‌వ‌న్‌ను అధికారంలోకి తీసుకురావ‌ల‌ని.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని.. చిరు కోరుకుంటున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. ఇది సాధ్య‌మేనా? అనే సందేహాలు కూడా ఆ వెంట‌నే తెర‌మీదికి వ‌స్తున్నాయి.

దీనికి కార‌ణం.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పేరుతో.. చిరు చేసిన ప్ర‌యోగం విక‌టించ‌డ‌మే. అంతేకాదు.. 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కేవ‌లం 18 స్తానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం వంటివి ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇది స‌హ‌జం కూడా.. ప్ర‌త్య‌ర్తులు ఈ విష‌యాల‌నే ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటారు. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తారు. కానీ, అప్పటి ప‌రిస్థితివేరు.. ఇప్పుడున్న ప‌రిస్తితి వేరని  అంటున్నారు మెగా అభిమానులు. అప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు ముందు పార్టీని స్తాపించి..త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కే అంటే.. కేవ‌లం 5 సంవ‌త్సరాలు లేదా రెండు ఎన్నిక‌ల‌ను అయినా.. చూడ‌కుండా.. జెండా తిప్పేశారు.

కానీ, జ‌న‌సేన అలా కాదు.. నిల‌క‌డ‌గా ముందుకు సాగుతోంది. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చేసింది కూడా.. స‌మ‌స్య‌ల‌పై.. ప్ర‌శ్న‌లు సంధించ‌డంతోపాటు.. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. న‌డుం బిగిస్తోంది. ర‌హ‌దారుల అంశాన్ని తీసుకుంటే.. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న స్వ‌యంగా రంగంలోకి దిగి.. రోడ్ల‌పై గుంత‌లు పూడ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. రాజ‌ధాని రైతుల ప‌క్షాన అమ‌రావ‌తి కోసం నిల‌బ‌డింది. నిరుద్యోగుల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. కౌలు  రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పైనా.. జ‌న‌సేన స్పందించింది. వారి కుటుంబాల‌కు ఆర్తిక సాయం అందిస్తూ.. ప్ర‌జ‌ల్లో నిలుస్తోంది.

ఇలా.. అనేక మైలు రాళ్లు.. క‌నిపిస్తున్నాయి. సో.. పార్టీ పుంజుకునేందుకు అన్ని అవ‌కాశాలు ఉన్నాయ‌ని మెగా అభిమానులు చెబుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక అంశాలు తెర‌మీదికి వ‌స్తాయ‌ని.. ముఖ్యంగా ఉచితాల‌కు అల‌వాటు ప‌డిన ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు మెగా కుటుంబం ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని దీనికి సంబంధిచంఇ ఏదైనా ఫార్ములాను తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అదేసమ‌యంలో.. సామాజిక వ‌ర్గాలుగా చీలిపోయిన ఏపీ స‌మాజంలో జ‌న‌సేను సామాజిక వ‌ర్గాల ర‌హిత పార్టీగా తీర్చి దిద్దే ప్ర‌య‌త్నం చేస్తే.. చిరు సంక‌ల్పం నెర‌వేర‌డం పెద్ద క‌ష్టం ఏమీ కాద‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News