తెలంగాణ‌లో ఫైర్‌... ఏపీలో తుస్‌.... బీజేపీ రాజ‌కీయ విన్యాసం..!

Update: 2022-11-20 02:30 GMT
తెలంగాణ బీజేపీలో ఫైర్ క‌నిపిస్తోంది. ఇక్క‌డ అధికార పార్టీపై ఏదో ఒక‌టి అని.. అనిపించుకుని, రాజ‌కీ యం గా దానిని ర‌గిలించి ఏదో ఒక విధంగా మైలేజీ పొందాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, అధికార పార్టీ నాయ‌కులు కూడా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు ప‌రిణామాలు.. తెలంగాణ‌లో వేడి పుట్టిస్తే.. ఏపీలో మాత్రం బీజేపీ-అధికార పార్టీ వైసీపీల మ‌ధ్య ఏదో దండ‌లో దారంలాంటి బంధం ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఏపీలో ఏదైనా.. ఎవ‌రైనా.. మాట్లాడినా బీజేపీలో పెద్ద సీరియ‌స్‌గా తీసుకోవ‌డం మానేశారు. అంతా లైట్ తీసుకుంటున్నారు. ఇంకేముంది, ప్ర‌భుత్వంపై చార్జిషీట్లు వేయ‌మ‌ని మోడీ చెప్పారు. ఇక‌, నుంచి రోజుకొక అంశంపై వైసీపీని నిల‌దీస్తాం. ఒక్కొక్క చార్జిషీటు వేస్తాం అంటూ బీజేపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న చేసి కూడా మూడు రోజులు అయింది. ఏ ఒక్క‌రూ ఆదిశ‌గా అడుగులు వేసింది లేదు.

ఇక‌, గ్రామాల బాట‌ప‌డ‌తాం, ప్ర‌భుత్వ తీరును అంచ‌నావేసి, ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొంటామ‌న్నారు. దీనిపై నాయ‌కులు మాట‌లు చెప్ప‌డమే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క అంచ‌నా వేసింది లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే నాయ‌కుల మ‌ధ్య సఖ్య‌త అంతంత మాత్రంగానే ఉందనేది జ‌గ‌మెరిగిన సత్యం. అయినా నాయ‌కులు క‌లిసే ఉన్నార‌ని చెప్పుకొంటున్నారు. అవ‌న్నీ ఒక విధానం అయితే, అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయంగా ఎటు వెళ్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.

దీనిపైనా బీజేపీ భారీ గంభీర వ్యాఖ్య‌లే చేస్తోంది. ప‌వ‌న్ త‌మ‌తోనే ఉన్నాడ‌ని.. త‌మ వాడేన‌ని చెబుతున్నా రు. కానీ, వాస్త‌వానికి.. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ ఏం చేస్తాడ‌నేది స్ఫ‌ష్టం అవుతుంద‌ని అంటున్నారు ప‌రి శీల‌కులు. సో.. మొత్తంగా చూస్తే ఏపీలో బీజేపీ తెలంగాణ‌లో క‌న్నా చాలా వీక్‌గా ఉండ‌డంతో వ్యూహాల లేమితో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేమితో అల్లాడుతోంద‌నేది వాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News