ఆల్ ఫ్రీ. ఇదొక ఎన్నికల ఎత్తుగడ. ఓట్లు కొల్లగొట్టే భారీ స్మీమ్, నిజానికి క్విట్ ప్రోకో అన్న దానికి ఇదే ఉదాహరణ అని చెప్పాలేమో కూడా. ఇక ఈ దేశంలో ప్రతీదీ ఖరీదు. తడిసి మోపెడు అయ్యే ఖర్చులు, పెట్రోల్, డీజిల్ ఇలా కాదేదీ అనర్హం అంటూ జీఎస్టీ బాదేస్తున్నారు. ఇంత బాదుడులోనూ ఉచితాలు మాత్రం సీమ టపాకాసుల్లా పేలుతున్నాయి. వాటికి యమ గిరాకీ ఉంటోంది. దాంతో ఉచితాల మీద సగటు జనాలు వెర్రెత్తుతున్నారు.
ఈ ఉచితాలకు మంగళం పాడే చాన్సే లేదా అన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఉచితం అంటూ ఖజనా గుల్ల చేసి తరతరాల దేశ, రాష్ట్ర సంపదలను దోచిపెట్టే వారి మీద యాక్షన్ లేదా అని మేధావుల సూటి ప్రశ్న. వీటి మీద దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.
దాన్ని విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఉచితాలను అరికట్టే మార్గం లేదా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. మా చేతిలో ఏదీ లేదని ఎన్నికల సంఘం బదులిచ్చింది. ఉచితాల వల్ల మంచి చెడ్డా అన్నీ ఓటర్లే తెలుసుకోవాలని కూడా పేర్కొంది.
దాంతో ఈ విషయం మీద అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. కాగా మొత్తం 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని, భారత్ కూడా మరో శ్రీలంక అవుతుందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. ఈ ఉచితాల వల్ల పెను భారాలు అయి దేశం ఏమవుతుందో అన్న ఆందోళనను కూడా పిటిషన్ లో వ్యక్తం చేశారు.
దీని మీద ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చునా కాదా అని సుప్రీం కోర్టు ప్రశించింది. ఈ విషయాన్ని ఆర్ధిక సంఘాన్ని అడిగి తెలుసుకోవాలని కోర్టు కోర్టు కేంద్రానికి సూచించింది.
ఇదిలా ఉంటే ఉచితాలు పధకాలు అంటూ జనాల వద్దకు వెళ్ళే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ ఆగస్ట్ 3కి వాయిదా పడింది. మరి ఇపుడు కేంద్రం దీని మీద ఏమంటుందో చూడాలి. ఈ మధ్యనే యూపీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితం అని హాట్ కామెంట్స్ చేశారు దాంతో కేంద్రం కూడా రాష్ట్రాలకు ముకుతాడు పెట్టేల ఆర్ధిక సంఘానికి కొన్ని సూచనలు చేస్తే మాత్రం కచ్చితంగా హామీలు, గాలి కబుర్లతో అధీకారం పట్టాలనుకే వారికి చిక్కులు తప్పవంతే.