మోడీ ఈ రోజు ప్రధానిగా ఉన్నారు అంటే దానికి గుజరాత్ కారణం. అక్కడ నుంచే మోడీ రాజకీయ ఎదుగుదల మొదలైంది. ఆయన ముమ్మారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ గ్లామర్ ని జాతీయ స్థాయిలో రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారు. పైగా గుజరాత్ మోడల్ అంటూ దేశమంతటినీ తన వైపుగా తిప్పుకున్నారు. అలా ఇప్పటికి రెండు మార్లు ప్రధానిగా మోడీ ప్రమాణం చేయడం వెనక గుజరాత్ పాత్ర చాలా ఉంది.
అయితే గుజరాత్ లో బీజేపీ పాతికేళ్ళకు పై చిలుకు అధికారం చలాయిస్తోంది. పైగా మోడీ వంటి సమర్ధ నాయకుడు ఆ రాష్ట్రం వదిలి బయటకు వచ్చాక బీజేపీకి మోడీలో సగమైనా సమర్ధత ఉన్న నాయకుడు ఈ రోజుకీ దొరకలేదు. ఎందరో ముఖ్యమంత్రులను మార్చి చూసారు కానీ మోడీ మార్క్ ని అందుకునే వారే లేకుండా పోయారు.
ఈ నేపధ్యంలో ప్రతీ ఎన్నికల్లో ఏదో కొత్త ఎత్తుగడలతో అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్న బీజేపీకి త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలు మాత్రం కలవరం కలిగిస్తున్నాయనే అంటున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీ మీద జనాలకు వ్యతిరేకత ఉంది. అదే టైమ్ లో కాంగ్రెస్ ఇంతకాలం అక్కడ ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. దాంతో ఈ రెండు జాతీయ పార్టీల మధ్య జరిగే పోరులో బీజేపీ సులువుగా గెలుస్తూ వచ్చేది.
కాంగ్రెస్ కి సొంత పార్టీలోనే శత్రువులు ఉండడం, వర్గ పోరు, బహుముఖ నాయకత్వాలు అన్నీ కలసి ఎపుడూ బీజేపీకి విజయాన్ని అందించేవి. కానీ ఇపుడు చూస్తే మాత్రం సీన్ మారుతోంది. ఆప్ అక్కడ కాంగ్రెస్ ప్లేస్ ని ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ఢిల్లీలో జయ కేతనం ఎగురవేసి పంజాబ్ లో పాతుకుపోయింది. ఇపుడు గుజరాత్ ని టార్గెట్ గా చేసుకుంది. దాంతో పాటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో చాలా దూకుడు చేస్తున్నారు.
ఈ పరిణామాలు కాషాయ దళంలో బెంబేలెత్తిస్తున్నాయి. జనంలో మార్పు కోసం కచ్చితంగా తపన ఉంది. తమ ఆలోచనలను తగినట్లుగా ఆప్ రియాక్ట్ అవుతోందని, దానికే ఓటు చేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇదే ఇపుడు బీజేపీలు గుబులు కలిగేలా చేస్తోంది. ఆప్ అంతకంతకు విస్తరించుకుంటూ పోతోంది. కాంగ్రెస్ తో లాభం లేదనుకున్న నాయకులు ఇపుడు ఆప్ జెండా పట్టుకుంటున్నారు.
మొత్తానికి బీజేపీని ఓడించాలనుకునేవారికి ఆప్ ఒక రాజకీయ వేదికగా మారుతోంది. ఈ నేపధ్యంలో ఈసారి ఎన్నికల్లో కాషాయం పార్టీ గెలుపు అంత ఈజీ కాదనే అంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ సీఎం అభ్యర్ధిగా కేంద్ర హోం మంత్రి, మోడీ కుడి భుజం అమిత్ షా పేరుని ప్రతిపాదిస్తారు అన్న ప్రచారం కూడా చేస్తున్నారు. అమిత్ షా అయితే జనాలలో ఎంతో కొంత ఆలోచన మారుతుందని అందుకే ఆయనను ట్రంప్ కార్డుగా వాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక చూస్తే ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేల్ నాయకత్వం మీద ప్రజలలోనే కాదు, బీజేపీలోనూ తీవ్ర అసంతృప్తి ఉంది అంటున్నారు. దాంతో ఆయన పేరుతో ఎన్నికలకు వెళ్తే కష్టమనే అమిత్ షా పేరుని తెర మీదకు తెస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఇది నిజమేనా అంటూ ఆప్ బీజేపీని ప్రశ్నిస్తోంది. అదే టైమ్ లో ఇది తమ తొలి విజయంగా చెప్పుకుంటోంది.
బీజేపీకి నిద్రపట్టనీయకుండా ఆప్ చేస్తోందని, అందుకే అమిత్ షా పేరును ముందుకు తెచ్చారని కూడా అంటున్నారు. ఈ పరిణామాలను చూస్తే కనుక బీజేపీ నిజంగా అమిత్ షా గుజరాత్ సీఎం అవుతారా. మోఅడీ షాల కంచుకోటను కాపాడుకుంటారా అన్న చర్చ అయితే నడుస్తోంది. గుజరాత్ కనుక చేజారిపోతే 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్న నేపధ్యంలో అమిత్ షా రంగంలోకి దిగుతున్నారా అంటే అవును అని కూడా జవాబు రావచ్చేమో.