రంగంలోకి మెగాస్టార్ : వైసీపీ టీడీపీ ఎవరికి షాక్....?

Update: 2022-10-05 02:30 GMT
ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రవేశిస్తారా అన్న చర్చ చాలా కాలంగా ఉంది. అయితే చిరంజీవి మాత్రం తనకు రాజకీయం వద్దు అనుకుంటూ ఆ కామెంట్స్ కి ఎప్పటికపుడు ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చారు. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఏమో భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇచ్చే  అవకాశం ఉంటుందేమో  అన్నట్లుగా చిరంజీవి హింట్ ఇచ్చి వదిలారు.

ఇపుడు దాని మీదనే ఏపీ రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి నేరుగా ప్రచారంలోకి వస్తారా లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న దాని మీద కూడా డిబేట్ సాగుతోంది. అయితే చిరంజీవి తాజా మాటలను బట్టి ఆయన నా తమ్ముడిని గెలిపించండి ఆయన నిజాయతీపరుడు అని జనాలకు చెప్పబోతారు అని అంటున్నారు. అంటే చిరంజీవి ఏపీ అంతా విస్తృతంగా తిరిగి ప్రచారం చేస్తారన్న మాట. ఏపీకి నిబద్ధత కలిగిన నిజాయతీ కలిగిన నాయకత్వం తన తమ్ముడు ఇస్తారు అని మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తే అపుడు జనాల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

ఇక మరో వైపు చూస్తే ఏపీలో అధికార వైసీపీకి ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే అంటున్నారు. ఇప్పటిదాకా చిరంజీవి మా వాడు తమ్ముడు పరాయివాడు అన్నట్లుగా విభజించి వైసీపీ మంత్రుల నుంచి అంతా మాట్లాడేవారు. పైగా అన్న సంస్కారవంతుడు తమ్ముడు కాదు అని కూడా విమర్శలు గుప్పించేవారు. చిరంజీవి రెండు మూడు సార్లు జగన్ ఇంటికి వెళ్ళి ఆయన అతీధ్యాన్ని స్వీకరించి వచ్చారు. దాంతో చిరంజీవి వైసీపీ మనిషి అన్న భావన కూడా కల్పించే ప్రయత్నం ఒకటి జరిగింది.

ఒక దశలో వైసీపీ తరఫున చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని వైసీపీ నిర్ణయించింది అని కూడా ప్రచారం చేశారు. అయితే దాన్ని చిరంజీవి తిప్పికొట్టారు. తాను రాజకీయాల్లోనే లేనని అందువల్ల తాను పదవులు ఏవీ కోరుకోవడం లేదని మీడియాకు  వివరణ ఇచ్చారు. దీంతో వైసీపీ ఆయన తాము ఇచ్చిన పదవులు పుచ్చుకోకపోయినా సైలెంట్ గా న్యూట్రల్ గా ఉన్నా చాలు తమ రాజకీయ కధ సాఫీగా సాగుతుంది అని భావించి ఉండవచ్చు.

కానీ చిరంజీవి మాత్రం తాను జనసేనకే మద్దతు ఇస్తాను అని లేటెస్ట్ గా  బోల్డ్ గా ఇచ్చిన ప్రకటనలతో అన్న తమ్ముళ్ళు ఇద్దరూ ఒక్కటే అని వైసీపీకి ఇప్పటికైనా అర్ధం అయి ఉండాలని అంటున్నారు. దాంతో ఇప్పటిదాకా చిరంజీవిని పొగిడిన వారు విమర్శలు చేయలేరు. అలాగని జనసేన తరఫున మెగాస్టార్ వచ్చి వైసీపీని గట్టిగా కార్నర్ చేస్తే అపుడు మరింత ఇరకాటంలో పడాల్సి ఉంటుంది.

ఆనాడు కనుక చిరు మీద విమర్శలు చేస్తే ఇన్నాళ్ళూ పొగిడింది ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. మొత్తానికి చిరు ఫ్యామిలీలో డిఫరెన్సెస్  ఉన్నాయని భావించి అన్నదమ్ములు వేరు అని తలచి వైసీపీ ఆడిన పొలిటికల్ గేమ్ ఏదైనా చివరికి ఆ పార్టీకే ఇబ్బంది అవుతోందా అన్న చర్చ అయితే ఉంది.

ఇంకో వైపు చూస్తే చిరంజీవి కనుక జనసేనకు మద్దతుగా వస్తే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అంటూ జరగదు అని అంటున్నారు. ఎందుకంటే పూర్తిగా జ‌నసేన తరఫున మాత్రమే మెగాస్టార్ ప్రచారం చేస్తారు. పైగా తమ్ముడు సీఎం కావాలని ఆయన జనంలోకి వస్తారు అని అంటున్నారు. అపుడు జనసేన సొంతంగానే పోటీకి దిగుతుంది. అదే జరిగితే ఓట్ల చీలిక భారీ ఎత్తున జరిగి అది టీడీపీకి కూడా ఇబ్బందికరంగా మారుతుందా అన్న చర్చ ఒకటి ఉంది. ఏది ఎలా చూసినా చిరంజీవి ఇచ్చిన తాజా స్టేట్మెంట్ మాత్రం ఏపీ రాజకీయాలో కలిని పుట్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News