శివసేనలో తిరుగుబాటు చేసిన నమ్మిన అధినేత ఉద్దవ్ ఠాక్రేను గద్దె దించి బీజేపీ బలంతో మహారాష్ట్ర సీఎం అయ్యాడు ఏక్ నాథ్ షిండే. ఇప్పుడు ఆ తిరుగుబాటు ఆయనపై మొదలైంది. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్ నాథ్ షిండేపై అసమ్మతి చెలరేగింది. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.
తాజాగా ఏక్ నాథ్ షిండే వర్గంలోనే చీలికలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెచ్చేలా ఉందన్న వార్తలు వస్తున్నాయి. శివసేన నుంచి తిరుగుబాటు చేసిన వచ్చిన షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు తాజాగా షిండేపై అసంతృప్తి రాజేస్తున్నారు. ఉద్దవ్ పై తిరుగుబాటు చేసిన 40 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు శివసేన పత్రిక సామ్నా రాసుకొచ్చింది. షిండేను తాత్కాలికంగానే ఆ పదవిలో కూర్చోబెట్టారని పేర్కొంది.
షిండే సీఎంగా ఏ క్షణంలోనైనా పదవి కోల్పోవచ్చు. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పడం తప్పని.. 22 మంది ఎమ్మెల్యేలు షిండేను గద్దెదించేందుకు రెడీగా ఉన్నారని.. వారంతా షిండేను కూల్చి బీజేపీలో చేరి కొత్త సీఎంను ఎన్నుకుంటారని ఉద్దవ్ వర్గం చెబుతోంది.
షిండే తిరుగుబాటు చేసి గద్దెనెక్కి తనకు తాను చాలా నష్టం చేశారని.. రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదిలిపెట్టరని శివసేన ఆరోపిస్తోంది. షిండేను బీజేపీ వాడుకొని వదిలేస్తుందని అంటున్నారు.
ప్రభుత్వం మొత్తం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని.. వారంతా సీఎంవో నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్నారని.. వాటిని షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.