వైరలవుతున్న కేరళ మహిళా మంత్రి... ఎందుకంటే..

Update: 2022-07-13 02:30 GMT
దేశం కోసం కొంద‌రు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ  ఉంటూనే ఉంటారు. తోటివారి కోసం కొంద‌రు తమది వదులుకుంటారు. జీవితం నేర్పిన పాఠం నుంచి కొంద‌రు గొప్ప క‌ల‌ల సాకారానికి కృషి చేసి ఉంటారు. ఇత‌రుల జీవితాల‌కు ఆయుష్షు నింపే ప్ర‌య‌త్నం చేయ‌డమే జ‌న్మ ధ‌న్య‌త‌కు అర్థం. ప‌ర‌మార్థం. ఇలాంటి అర్థ‌ప‌ర‌మార్థాలు రాజ‌కీయాల్లో ఉన్న కొద్దిమందికే తెలుసు. ఆ కేర‌ళ మంత్రి ఎంత మంచివారో ! అని అంతా నెటిజ‌న్లు అంతా పొగుడుతున్నారు.

ఆప‌ద‌లో ఉంటే సాయం చేయడం ఓ ఎత్తు అది కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున సాయం చేయ‌డం ఓ ఎత్తు కానీ ఇక్క‌డ ఆమె త‌న రెండు బంగారు గాజుల‌నూ ఓ బాధితుడికి వైద్యం నిమిత్తం ఇచ్చి మంచి మ‌న‌సు చాటుకున్నారు. మేలిమి ముత్యం అనిపించుకున్నారు. వీరు కదా  ఈదేశానికి కావాలి అని ఆ కేర‌ళ మంత్రిని, ఆ మాతృమూర్తిని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కీర్తిస్తూ ఉన్నారు.

కేర‌ళ ఉన్న‌త విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు చేసిన ఈ మంచి ప‌ని ఇప్పుడు ఆద‌ర్శ‌నీయంగా ఉంది. తాను ఓ స‌మీక్ష స‌మావేశానికి విచ్చేశారు. త్రిస్సూరు జిల్లా, ఇరింజ‌ల‌కుడకు విచ్చేశారు.  వైద్య స‌హాయ క‌మిటీ స‌మావేశానికి హాజ‌రై, అక్క‌డ స్థితిగ‌తులు తెలుసుకునేందుకు అధికారుల‌తో  స‌మావేశం అయ్యేందుకు వ‌చ్చారు.  

ఆమె రాక సంద‌ర్భంగా ఓ కిడ్నీ బాధితుడు  అక్క‌డికి వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకున్నాడు. 27 ఏళ్ల వివేక ప్ర‌భాక‌ర్ అనే వ్య‌క్తి త‌న గోడును వెళ్ల‌గ‌క్కాడు. త‌న‌ను ఆదుకోవాల‌ని మాన‌వ‌తా దృక్ప‌థంతో ప్ర‌భుత్వం త‌ర‌ఫున సాయం అందించాల‌ని వేడుకుంటూ కన్నీటిప‌ర్యంతం అయ్యాడు.

ఆయ‌న  క‌ష్టం తెలుసుకున్న వెంట‌నే మంత్రి స్పందించి త‌న చేతికి ఉన్న రెండు బంగారు గాజులూ ఇచ్చి పంపారు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అయింది. చికిత్స నిమిత్తం వీటిని వాడుకోమ‌ని చెప్పి త‌న‌వంతు భ‌రోసా ఇచ్చి పంపారు. ఈ వార్త ఇప్పుడు ద‌క్షిణాదిలోనే కాదు దేశ వ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. దైవం మ‌నుషుల రూపంలో అంటే .. ఇదే విధంగా ఉంటుంది మేడ‌మ్ అని ఆమెకు ప్ర‌శంస‌లు అందిస్తున్నారు  నెటిజ‌నులు.
Tags:    

Similar News