మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్ధకం అమ్మ అనిపించుకోవడమే స్త్రీ మూర్తికి గౌరవం అని ఒక పాత సినిమాలో కవి అద్భుతంగా రాశారు. అంటే అమ్మతనం గొప్పతనం ఏంటో అర్ధమవుతుంది. అసలు ఈ భూమి మీద చెట్టూ చేమతో సహా సమస్త జీవరాశులకు పునరుత్పత్తి అన్నది అతి ముఖ్య ధర్మం. ఆధునిక జీవన విధానంలో అనేక రకాలైన కాలుష్యాల వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతోంది.
దాంతో సాంకేతిక విజ్ఞానం అసరాతో అనేక రకాలైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో సరోగసి ఒకటి. సరోగసి అంటే అచ్చ తెలుగులో అద్దె గర్బం అని చెప్పుకోవాలి. పిల్లలు లేక అల్లాడిపోతున్న వారు ఎంతకైనా ఖర్చు చేసి తమ సంతానాన్ని చూడాలనుకునే వారికి సరోగసీ ఒక అద్భుతమైన అవకాశం.
అయితే సరోగసీ అన్నది అమ్మతనానికి వరం తప్ప సరదా కోసం కానే కాదు. అంతే కాదు అమ్మతనాన్ని ఏ బరువూ బాధ్యత లేకుండా అద్దె తల్లితో మోయించి ఎంజాయి చేయడానికి అంతకంటే కాదు. ఎవరైతే సంతానం కావాలని తపించి పోతారో, వారికి పిల్లలు పుట్టని విధంగా వంధ్యత్వం సమస్య కనుక ఉంటే అలాంటి వారు బిడ్డల కోసం సరోగసీ ద్వారా తమ జీవితాశయాన్ని నెరవేర్చుకోవచ్చు.
అయితే దీనికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఆషామాషీగా ఎవరూ సరోగసీ విధానం కోసం వెళ్లరాదు. అద్దె గర్బం ద్వారా సంతానం కోరుకున్న వారికి పెళ్ళి అయిన్ అయిదేళ్ళు పూర్తి కావాలి. ఇక భార్య వయసు 25 నుంచి 50 లోపు ఉండాలి. భర్త వయసు 26 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి. ఇక వీరికి గతంలో బయోలాజికల్ లేదా దత్తత ద్వారా పిల్లలు ఉండకూడదు.
ఇక జంటలో ఎవరికైనా ఇంఫెర్టిలిటీ ఉందని ధృవీకరిస్తూ జిల్లా మెడికల్ బోర్డు సర్టిఫై చేసిన ధృవపత్రం ఉండాలి. అంతే కాదు సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కుల కోసం మెజిస్ట్రేట్ ఉంచి ఉత్తర్వులు పొందాలి. ఇక అద్దె తల్లికి ప్రసవం తరువాత పదహారు నెలల పాటు భీమా సదుపాయం కల్పించాలి. ఇలా కఠిన నిబంధనలే ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే వారు అద్దె గర్బం కోసం అర్రులు చాచడం, డబ్బుంది కదా అని అద్దె తల్లిని ఎంచుకుని ఆమె చేత గర్బాన్ని మోయించాలని చూడడం తగదని అంటున్నారు.
ఇక సరోగసీ విధానం అనేక రకాలుగా దుర్వినియోగం అవుతోందని, సక్రమంగా దీన్ని ఉపయోగించేలా చూడాలని కేంద్రం భావించి ఈ ఏడాది జనవరిలో నూతన సరోగసీ నియంత్రణ చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఒక విధంగా ఇది విప్లవాత్మకమైనదిగానే అంతా భావిస్తున్నారు. ఈ విధానం ప్రకారం చూస్తే ఎవరైనా మహిళకు ఈ దేశంలోని దంపతుల కోసం బిడ్డను కనేందుకు అనుమతి ఉంటుంది. కానీ వాణిజ్యపరంగా సొమ్ము చేసుకోవడానికి ఈ విధంగా కన్న బిడ్డలను అమ్ముకోవడానికి చేసేందుకు సరోగసీ మీద చేసిన నూతన చట్టం అనుమతించదు.
అద్దె గర్బం ద్వారా పుట్టిన వారికి విక్రయించేందుకు అసలు వీలు అవదు. ఇక సరోగసీ ద్వారా బిడ్డను కనేసి ఆ మీదట వల్ల కాదని వదిలిపెట్టడానికి అసలు కుదరదు అని చట్టం చెబుతోంది. సరోగసీ బిడ్డల అక్రమ రవాణా మీద కేంద్రం నిషేధం విధించింది. ఈ నిబంధనలలో దేన్ని ఉల్లఘించినా ఏకంగా పదేళ్ల జైలు, అలాగే పది లక్షల జరీమానా కూడా చట్టం ప్రకారం విధించే వీలు ఉంది.
సరోగసీ విధానం దుర్వినియోగం కాకుండా ఈ చట్టం ప్రకారం కొన్ని గట్టి షరతులు కూడా విధించారు. అద్దె గర్బం ధరించే మహిళకు వివాహం అయి ఉండాలి లేదా విడాకులు తీసుకున్న మహిళ అయినా ఫరవాలేదు. అంతే కాదు ఆమె సొంతంగా గతంలో ఒక బిడ్డకు జన్మ ఇచ్చి ఉండాలి. ఈ అద్దె గర్బాన్ని ఆ మహిళ తన జీవిత కాలంలో ఒకసారి మత్రమే మోసేందుకు అనుమతించిది చట్టం. అద్దె గర్బం ధరించే మహిళ వయసు కూడా 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. అంతే కాదు అద్దె గర్బం కోరుకునే దంపతులకు ఆమె దగ్గర బంధువు అయి ఉండాలని మరో షరతు విధించారు.
ఇలా చట్టాన్ని కట్టుదిట్టం చేయడం షరతులు విధించడం ఎందుకంటే ఈ సరోగసీ దుర్వినియోగం అవుతూండడమే. చాలా మంది డబ్బున్న వాళ్లకు సంఘంలో పలుకుబడి ఉన్న వారికి పిల్లలు కావాలి కానీ వారు గర్బం ధరించేందుకు మాత్రం అంగీకరించరు. అది బాధ బరువు అని కూడా అనుకుంటారు. అన్ని విషయాల లాగానే డబ్బులు పడేస్తే ఎవరో మోసే మనిషి ఉంటారు కదా అని భావిస్తున్నారు. అంతే కాదు సినిమా సెలెబ్రిటీస్ విషయానికి వస్తే కొందరు తమ అందానికి ఇబ్బంది వస్తుందని, తమ కెరీర్ కి ఆటంకం ఏర్పడుతుంది అని భావించి సరోగసీకి వెళ్తున్నారు.
అయితే చట్టప్రకారం అన్ని రకాలుగా మాతృత్వానికి అర్హత కలిగిన మహిళ కానీ వంధ్యత్వం లేని భర్త కానీ సరోగసీకి వెళ్లాలనుకుంటే అది పెద్ద నేరం. వారికి పదేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టం చెబుతోంది. అలాగే బిడ్డలు కావాలి కానీ మేమేమిటి కడుపును మోయడం అని చికాకుగా చూసేవారికి కూడా సరోగసీ విధానం అసలు కుదరదు అని చట్టం చెబుతోంది. అమ్మతనం కోసం ఆరాటపడే కోట్లాది మంది అభాగ్యులైన తల్లిదండ్రుల కోసం వచ్చిన ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారు ఎంతటి పెద్ద వారు అయినా శిక్షలు గట్టిగా అమలు చేయాల్సిందే అని మేధావులు కూడా సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.