టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారం భించేందుకు కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. మరో 50 రోజుల్లోనే ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీంతో ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు అంతర్గతంగా పార్టీ నాయకులతో ఆయన భేటీలు నిర్వహిస్తున్నారు. అత్యంత రహస్యంగా.. ఏర్పాట్లపై చర్చిస్తున్నట్టు సమాచారం.
దీనిలో ప్రధానంగా డబ్బుల వ్యవహారం.. చర్చకు వస్తోంది. జిల్లాల్లో జరిగే పాదయాత్రకు.. ఆయా జిల్లాల్లో ని నాయకులు బాధ్యత తీసుకోవడం సహజమే. అయితే, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి.. టికెట్లు ఇచ్చే అవకాశం చాలా తక్కువ. కేవలం వారు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే పరిమితం అయ్యారు. కానీ, ఇప్పు డు పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతను మాత్రం వారికి అప్పగిస్తుండడంతో వారు చిన్నబు చ్చుకుంటున్నారని తెలిసింది.
నిజానికి పాదయాత్ర అంటే.. గతంలో చంద్రబాబు యాత్ర చేసిన సమయంలో కీలకమైన పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ప్రధానంగా నిధులు సమకూర్చారు. వీరికి తర్వాత కాలంలో టికెట్లు, పదవులు దక్కాయి. దీంతో వారు సంతృప్తి చెందారు. కానీ, ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా? అనేది నేతల డౌట్. ``మేం అప్పులు చేసో.. ఆస్తులు అమ్మో డబ్బులు పెడతాం.. కానీ, మాకేంటి? టికెట్లు వేరేవారికి ఇస్తారు`` అని కృష్ణాజిల్లాకు చెందిన ఒక అగ్ర వర్ణ నాయకుడే వ్యాఖ్యానించినట్టు సమాచారం.
దీనిపై నారా లోకేష్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు చెప్పమన్నారు.. అంటూ ఆయన బాధ్యతలు అయితే.. పంపిస్తున్నారు. మీరు ఇది చేయాలి.. మీరు ఇది చేయండి.. అని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ``ఇటీవల చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జనాల్ని తరలించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ఒకరు భుజాన వేసుకున్నారు. ఆయనకు టికెట్ ఇస్తారు. మేం కూడా చేస్తాం.. మాకు టికెట్ ఇస్తారా? `` అని ప్రశ్నిస్తున్న గళాలు పెరుగుతుండడం గమనార్హం. దీంతో పాదయాత్ర ముందే లోకేష్‌కు బంధనాలు పెరుగుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.