ఏపీ సర్కార్ కేంద్రానికి పంపిన ఒక ప్రతిపాదనను పక్కన పెట్టేయడం ఇపుడు రాజకీయ సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో మంచి దోస్తీ చేస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక కేంద్రానికి అవసరమైనపుడూ లేనప్పుడూ కూడా తెగపొగుడుతూ ఉంటారు వైసీపీ పెద్దలు.
కేంద్రానికి ఏ నొప్పి వచ్చినా మేమున్నామని మందు పూసే పని చేస్తూ ఉంటారు. రాహుల్ మోదీని విమర్శించినా వైసీపీ నేతలు బీజేపీ వారి కంటే ముందుకు వచ్చి కౌంటర్లేస్తారు.
అలాంటిది వైసీపీని కేంద్రం సడెన్ గా పక్కన పెట్టేసిందా అన్న డౌట్లు వస్తున్నాయి. విషయం ఏంటి అంటే ఏపీలో బీచ్ సాండ్ మైనింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరితే నో అని చెప్పేయడమే ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. పోనీ ఏపీ సర్కార్ ప్రతిపాదనను పక్కన పెడితే పెట్టవచ్చు కానీ కొన్ని కీలక కామెంట్స్ కూడా చేసిందని అంటున్నారు.
బీచ్ సాండ్ నుంచి అణు ఇంధనానికి అవసరమైన మోనోటైజ్ ని పెద్ద ఎత్తున తవ్వితీస్తున్నారని, దాన్ని అక్రమంగా విదేశాలకు పంపించి భారీ ఎత్తున ఎగుమతులు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పేర్కొనడమే ఇక్కడ చిత్రం.
దాంతో కేంద్రం మేలుకొందని అంటున్నారు. అంతే కాదు ఇలా వచ్చిన ఫిర్యాదుల మీద అణు ఇంధన శాఖ సూచనలతో దర్యాప్తు చేపట్టాలని బ్యూరో ఆఫ్ మైన్స్ కి ఆదేశాలను కూడా కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ మేరకు దీని మీద గనుల శాఖకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. మొత్తానికి చూస్తే ఏపీ సర్కార్ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చడం అతి పెద్ద షాక్ గా చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఈ వర్షాకాల సమావేశాలలో వరసబెట్టి వైసీపీకి ఝలక్కులు షాకులు తగిలేస్తున్నాయి. మరి వైసీపీ బీజేపీల మధ్య ఏ రకమైన రాజకీయం సాగనుందో ఫ్యూచర్ లో చూడాల్సిందే.