ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరమంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నారో తెలియదుకానీ.. ఉచితాలు అమలు చేసే రాష్ట్రాలను మాత్రం ఆయన ఏకేస్తున్నారు. ఈ వరుసలో ఏపీ కూడా ఉంది. మరి.. మోడీ చేస్తున్న వరుస విమర్శలపై సీఎం జగన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. నిజానికి దేశంలో అనేక పథకాలను ఉచితంగా ఇస్తున్నామని.. చెప్పుకొంటున్న జగన్.. మోడీకి మాత్రం కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు.
కానీ, కేంద్ర పాలిత రాష్ట్రం డిల్లీలోసీఎంగా ఉన్న కేజ్రీవాల్ మాత్రం మోడీని ఏకేశారు. మరి ఆ మాత్రం ధైర్యం జగన్‌కు లేదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉచిత పథకాల గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు అంటించారు. ప్రధాని పేరు ప్రస్తావించకుండానే సునిశిత విమర్శలు చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ఉచితాలు కావని... వ్యాపార వేత్తలకు రూ.వేల కోట్లు మాఫీ చేయడం లాంటివి ఉచిత పథకాల కిందికి వస్తాయని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని 18 లక్షల విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఉచిత పథకం కాదని... 2 కోట్ల మంది ప్రజలకు వైద్యం అందించడం ఉచితం కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. "పేద, మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన, ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇవి ఉచిత పథకాలు కాదు, దేశ పునాదికి మేము ఒక్కొక్క ఇటుకను పేర్చుతున్నాం. ఇవాళ ఢిల్లీ ఆస్పత్రులను మేము అద్భుతంగా తీర్చిదిద్దాం. ఢిల్లీలో అద్భుతమైన మెుహల్లా క్లినిక్‌లపై ప్రపంచంలో చర్చ జరుగుతోంది.`` అని అన్నారు.
మోడీకి ఘాటు కౌంటర్..
"ఇప్పుడు ఉచిత పథకాలు అంటే ఏంటో నేను చెబుతాను. ఈ దేశంలో ఉచిత పథకాలు ఎవరు ఇస్తున్నారో నేను వివరిస్తా. ఒక ప్రముఖ సంస్థ ఉంది. ఆ సంస్థ ఒక బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఖర్చు చేసింది. తర్వాత బ్యాంకు దివాలా తీసింది. ఆ సంస్థ దేశంలోని ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చింది. ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది ఉచిత పథకం అంటే.
మీ స్నేహితులకు వేలాది కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తున్నారు కదా అవీ ఉచిత పథకాలు అంటే. విదేశీ యాత్రలకు వెళ్లినపుడు ఆ ప్రభుత్వాల నుంచి మీ మిత్రులకు వేలకోట్ల కాంట్రాక్టులు ఇప్పించడం ఉచిత పథకం" అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో అనేక ఉచిత పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న జగన్.. కనీసం.. మోడీ ఇంతగా వ్యాఖ్యలు చేస్తున్నా.. పెదవి విప్పలేరా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిని బట్టి మోడీ ఏమన్నా పడేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.