కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం మారుతుందా?

Update: 2022-03-21 06:30 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు!  నాయ‌కుల‌కు అవ‌స‌రం.. ద‌క్కే అవ‌కాశం.. రెండు ప్రాతిప‌దిక‌లే కేంద్రంగా రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పులైనా ఉంటాయి. అవ‌స‌రాన్ని నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మారుతుంటాయి. గ‌తం లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అన్న‌గారు ఎన్టీఆర్‌.. నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చుకున్న హిస్ట‌రీ ఉంది. ఒకేసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ప‌రిస్థితి కూడా ఉంది. సో.. రాజ‌కీయాల్లో నాయ‌కులు అప్ప‌టిక‌ప్పుడు ఉండే ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకుని ముందుకు సాగ‌డం అనేది మామూలు వ్య‌వ‌హార‌మే.

స‌రే.. తాజా విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఫైర్ బ్రాండ్ కేసీఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియో జ‌క‌వ‌ర్గాన్ని మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతోంది. దీనికి త‌గిన విధంగా నే ఓ నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌జ‌లు.. కేసీఆర్ మా ద‌గ్గ‌ర‌కే వ‌స్తున్నాడు... అని అంటున్నారు. ఇక‌, టీఆర్ ఎస్ నేత‌లు సైతం.. ఇదే విష‌యంపై చ‌ర్చ చేస్తున్నారట‌. ఆ ఏరియాలోనే యాద‌గిరి గుట్ట ఉంద‌ని.. దీనిని అంత‌ర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప‌నిలో కేసీఆర్ ఉన్నాడ‌ని చెప్పుకొంటున్నారు.

ఇక‌, కేసీఆర్ రాక‌తో.. అక్క‌డ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంద‌ని అంటున్నార‌ట. ఇంత‌కీ.. ఆ నియోజ‌క‌వ ర్గం.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని ఆలేరు నియ‌జ‌క‌వ‌ర్గం అంటున్నారు. అక్క‌డ దేవాల‌యాల‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. దీనివ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ భారీగా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని అంటున్నారు. నిజానికి ఇప్పుడు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇది టీఆర్ ఎస్‌కు ఎప్ప‌టికైనా ఇబ్బందిక‌ర ప‌రిణామమే. అందుకే.. దీనిని త‌గ్గించాల‌ని అంటే.. ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాల‌ని.. కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగా కేసీఆర్ క‌నుక ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌స్తే.. ఇక్క‌డ కాంగ్రెస్ హవా త‌గ్గించ‌డంతోపా టు.. నియోజ‌క‌ వ‌ర్గం, జిల్లాను కూడా గులాబీ మ‌యం చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తు న్నారు. ఈ నేప‌థ్యం లోనే కేసీఆర్ ఇక్క‌డ‌కు రావ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. నిజానికి ఆది నుంచి కూడా కాంగ్రెస్‌ కు కంచుకోట‌గా ఉన్న న‌ల్గొండ‌లో.. గులాబీ జెండా ఎగరాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్‌ప‌దేప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో కేసీఆరే స్వ‌యంగా రంగంలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News