మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న నైజీరియా.
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారికి చెక్ చెప్పేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం అగ్ర దేశాలకు చెందిన పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేస్తున్న సంస్థలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. అందరి అంచనాలకు భిన్నంగా ఒక ఆఫ్రికన్ దేశం వ్యాక్సిన్ కనుగొందన్న వార్త బయటకు వచ్చింది. మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ ను తాము కనుగొన్నట్లుగా నైజీరియన్ వర్సిటీలు ప్రకటించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం చూస్తే.. ప్రస్తుతం పదమూడు వ్యాక్సిన్లను మనుషుల మీద ప్రయోగిస్తున్నారు. మొత్తం 120 సంస్థలు ఈ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆఫ్రికన్ల కోసం నైజీరియా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనటంలో విజయం సాధించినట్లుగా చెబుతున్నారు. ఇదేమీ తప్పుడు వార్త కాదని.. నిజమైనదన్న మాట వారి నోటి వెంట వస్తోంది.
ఆఫ్రికాలో ఆఫ్రికన్ల కోసం వ్యాక్సిన్ డెవలప్ చేసినట్లుగా అడిలెక్ వర్సిటీ మెడికల్ వైరాలజీ.. ఇమ్యునాలజీ.. బయో ఇన్ఫరేట్మిక్స్ ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ ది గార్డియన్ నైజీరియా సంస్థ తెలిపింది. ఇంకేం.. వ్యాక్సిన్ కనుగొన్నట్లేనని ఆనందపడటానికి వీల్లేదంటున్నారు.
ఎందుకంటే..ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికిప్పుడు బయట వారికి ఇవ్వటం సాధ్యం కాదంటున్నారు. ఎందుకంటే.. దీన్ని ఆఫ్రికన్ల కోసం తయారు చేశామని.. మిగిలిన వారంతా వాడేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను వాడొచ్చని.. నకిలీది ఎంతమాత్రం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.
దీన్ని కనుగొనేందుకు తమ శాస్త్రవేత్తలు విపరీతంగా శ్రమించినట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి తీసుకురావాలంటే కనీసం పద్దెనిమిది నెలలు పడుతుందని చెబుతున్నారు. తామిప్పటికే పెద్ద ఎత్తున పలువురి మీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించామని.. ఫలితాలు బాగా వచ్చినట్లుగా వారు పేర్కొంటున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సిన ఈ వ్యాక్సిన్ వైనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.