పొరపాటున వేసిన బాంబు ఫలితమిది

Update: 2017-01-18 10:34 GMT
చిన్న పొరపాటే అంటూ చేసిన తప్పు చిన్నదైనా దాని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది అనడానికి తాజా ఉదాహరణ నైజీరియాలో చోటుచేసుకుంది. ఈ విషయాలపై పొరపాటయ్యిందని వారు చెబుతున్నా... ఈ పొరపాటులో చాలామంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోగా, మరికొంత మందిని రక్తపు మడుగులో గాయాలతో ఉంచింది. ఆ పొరపాటు ఫలితం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

వివరాళ్లోకి వెళితే... నైజీరియాలోని కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో బోకోహారం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుపుతుంది ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం. అయితే ఈ సమయంలో ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున సమీప ప్రాంతంలో ఉన్న శరణార్ధుల శిబిరంపై వేసింది. దీంతో 100మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందగా, 120మంది వరకూ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఇలా మరణించినవారిలో శరణార్ధులతో పాటుగా వారికి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన నేషన్స్ వితౌట్ బార్డర్స్ - రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాలపై స్పందించిన నైజీరియా మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లక్కీ ఇరాబొర్... తాము చేసింది పెద్ద పొరపాటే అని ఒప్పుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News