ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అటు హైకోర్టులో ఫైట్ చేయడంతోపాటు ఇటు నుంచి కూడా నరుక్కొస్తున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ హరిచందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కలిశారు. రాజ్ భవన్ లో వీరిద్దరి భేటి జరిగింది.
పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, హైకోర్టు తీర్పు, తాజా పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పంచాయితీ ఎన్నికలపై దుమారం సాగుతున్న వేళ నిమ్మగడ్డ ఏకంగా గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల కోడ్ విధించినా సీఎంజగన్ అమ్మఒడిని ప్రారంభించడం.. ఎన్నికల కమిషన్ నిర్ణయాలను పట్టించుకోకపోవడంపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఇక స్థానిక ఎన్నికలపై ఇప్పటికే హైకోర్టులో సవాల్ చేశారు నిమ్మగడ్డ రమేశ్. ఈ పిటీషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు ప్రారంభమైన వెంటనే విచారణ వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం 1 గంటకు ధర్మాసనం వాదనలు విననుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి నిన్న తీర్పునిచ్చారు. దీనిపై వెనక్కి తగ్గని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. డివిజన్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేశారు.ఈరోజు దీనిపై విచారణ జరుగుతోంది.