నిమ్మగడ్డ వర్సెస్ జోగి.. ఏపీ హైకోర్టులో పిటీషన్

Update: 2021-02-12 12:05 GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మధ్య 'పంచాయితీ' హైకోర్టుకు ఎక్కింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనపై విధించిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ హైకోర్టును వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆశ్రయించారు. తన పరిధులను దాటి నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించే అధికారం ఆయనకు లేదని పిటీషన్ లో పేర్కొన్నారు.  

తాజాగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలపై పోటీచేసే వారికి సంక్షేమ పథకాలు కట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.నివారం వరకూ జోగి రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదని, విలేకరుల సమావేశాలను నిర్వహించకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.

ఓటర్లను భయాందోళనలకు గురిచేశారనే కారణంతోనే జోగి రమేశ్ పై చర్యలకు దిగారు నిమ్మగడ్డ రమేశ్. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆయన మీడియాతో మాట్లాడకూడదంటూ ఆంక్షలను విధించారు.దీనిపై జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. శాసన సభ్యుడిపై చర్యలు తీసుకోవడం.. ఆంక్షలను విధించే అధికారం నిమ్మగడ్డకు లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లంచ్ మోహన్ పిటీషన్ లో పొందుపరిచారు. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.
Tags:    

Similar News