నిర్భయ దోషులకు ఉరి డేట్ డిసైడ్ !

Update: 2020-01-07 07:01 GMT
నిర్భయ ..ఈ పేరు తెలియని ఇండియన్ ఎవరు ఉండరు. నిర్భయ ఉదంతం కేసులో దోషులకు ఈ రోజు డెత్ వారెంట్ డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నిర్భయ పై అత్యాచారానికి పాల్పడి ఏడేళ్లు పూర్తయినప్పటికీ.. నిందితులు ఇంకా జీవించే ఉన్నారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిర్భయ పేరుతొ చట్టం కూడా అమల్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది. అయితే , ఉరి శిక్షను అమలు చేయడానికి అవసరమైన డెత్ వారెంట్ మరి కొన్ని గంటల్లో వెలువడొచ్చని సమాచారం. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం ఈ డెత్ వారెంట్ ను జారీ చేయాల్సి ఉంది.

నిర్భయ పై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష ను అమలు చేయాల్సి ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు జైల్లోనే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇక మరొకడు మైనర్ కావడం తో కొన్ని రోజుల జైలు శిక్ష అనంతరం విడుదల చేసారు. ఈ నేపథ్యంలోనే తీహార్ జైలులో ఉంటోన్న నలుగురికీ ఉరిశిక్షను విధించడానికి అవసరమైన డెత్ వారెంట్ యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలంటూ కిందటి నెలలో నిర్భయ తల్లి ఆశాదేవి పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు.

దీనిపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ తేదీ రానే వచ్చింది. ఈ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ పిటీషన్ పై న్యాయస్థానం పునర్విచారణ చేపట్టనుంది. అనంతరం డెత్ వారెంట్ ను జారీ చేసే అవకాశం ఉంది. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ కు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అతని వైఖరేమిటనేది వెల్లడించాలంటూ తీహార్ జైలు అధికారులకు న్యాయమూర్తి సతీష్ అరోరా నోటీసులను జారీ చేయడం వల్ల డెత్ వారెంట్ ను మంజూరు చేయడం లో జాప్యం చోటు చేసుకుంది. పటియాలా హౌస్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ అరోరా ఈ నోటీసును జారీ చేశారు.
Tags:    

Similar News