అరుదైన రికార్డు సొంతం నిర్మలమ్మ సొంతం

Update: 2019-12-13 11:09 GMT
తెలుగింటి కోడలు కమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా అంతర్జాతీయ మేగ్ జైన్ ప్రకటించిన టాప్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఫోర్బ్స్ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామ్మ పేరు మారుమోగుతోంది.  ఫోర్బ్ పత్రిక తాజాగా విడుదల చేసిన టాప్ 100 పవర్ ఫుల్ ఉమెన్ జాబితాలో నిర్మలమ్మకు దక్కిన స్థానం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసేదే.

ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్న.. అమెరికా అధ్యక్షుడ్నే తండ్రిగా చేసుకున్న ఇవాంకా.. వైట్ హౌస్ మొత్తాన్ని తన సింగిల్ హ్యాండ్ లో చెలరేగిపోతున్న వేళలోనూ.. ఆమె కంటే మన నిర్మలమ్మే మోస్ట్ పవర్ ఫుల్ గా ఫోర్బ్స్ తేల్చటం విశేషం. నిర్మలమ్మకు 34వ స్థానం దక్కితే.. ఇవాంకా ట్రంప్ ఏకంగా 42వ స్థానానికి పరిమితమయ్యారు. ఆమే కాదు క్వీన్ ఎలిజిబెత్ 2 సైతం నిర్మలమ్మ కంటే వెనుకబడ్డారు. జాబితాలో ఆమె 40వ స్థానానికి పరిమితమయ్యారు.

ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురు చోటు సంపాదించుకున్నారు. నిర్మలమ్మతో పాటు బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా.. హెచ్సీఎల్ ఎంటర్ ప్రైజెస్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా.. ల్యాండ్ మార్క్ గ్రూపు సీఈవో రేణుకా జగిత్యాణి ఉన్నారు. ఇక.. టీనేజర్ అయినప్పటికీ పర్యావరణ అంశం మీద ప్రపంచ వేదికల మీద అగ్ర రాజ్యాల్ని ఉతికి ఆరేస్తున్న టీనేజ్ సంచలనం గ్రేటా థన్ బర్గ్ వందో స్థానంలో నిలిచారు. జాబితాలో చోటు సంపాదించిన అందరి కంటే వయసు తక్కువ ఆమెది కావటం విశేషం.

మరి.. జాబితాలో టాప్ పొజిషన్లో ఉన్నదెవరన్నది చూస్తే.. జర్మనీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ అగ్ర స్థానంలో నిలిచారు. గడిచిన తొమ్మిదేళ్లుగా ఆమె ఈ జాబితాలోకొనసాగటం ఒక ఎత్తు అయితే.. లిస్టులోని వారిలో అత్యధికులు ఉత్తర అమెరికాకు చెందిన వారే కావటం గమనార్హం. మొత్తం వందమందిలో యాభై మంది ఇక్కడి వారే అయితే.. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి చెందిన వారు 21 మంది కాగా.. యూరప్ నకు చెందిన వారు 18 మంది ఉన్నారు. యూకే నుంచి ఐదుగురు ఈ లిస్టులో ఉన్నారు.


Tags:    

Similar News