జ‌గ‌న్ స‌ర్‌.. వినిపించిందా.. నిర్మ‌ల‌మ్మ నిప్పులు చెరిగేశారు!

Update: 2022-12-22 04:57 GMT
జ‌గ‌న్ స‌ర్‌.. వినిపించిందా! అంటూ.. రాజకీయ నేత‌లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. 'ఓ రాష్ట్రం' జీతాలివ్వ‌లేని స్థితిలో ఉంద‌ట‌!' అంటూ.. పార్ల‌మెంటు సాక్షిగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మ‌న్ నిప్పులు చెరిగేశారు. వాస్త‌వానికి ఇప్పుడు ఏపీ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి రెండు వారాల‌కు ఒక‌సారికి ఢిల్లీకి వెళ్ల‌డం.. అప్పుల కోసం.. కేంద్రం చుట్టూ  ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం.. తెలిసిందే.

ఈ క్ర‌మంలో పోనీ అప్పులు చేసినా.. స‌ద‌రు నిధుల‌ను అభివృద్ధిపైనా.. ఆదాయ జ‌న‌రేష‌న్ రంగాల‌పైనా పెడుతున్నారా? అంటే అది కూడా లేదు. కేవ‌లం సంక్షేమం పేరుతో నిధుల పంప‌కాల‌కే తెర‌దీస్తున్నారు.

ఇదే విష‌యంపై కేంద్రం చాలా సీరియ‌స్ గా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా నిర్మ‌లా సీతారామ‌న్‌.. సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ పేరు చెప్ప‌కుండానే ఆమె రాష్ట్రంపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పార్ల‌మెంటులో మాట్లాడిన నిర్మలా సీతారామన్   ఓ రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరిందని కామెంట్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని వాళ్లు కూడా దేశవ్యాప్తం గా ప్రచారానికి మాత్రం విపరీతంగా ఖర్చు చేస్తున్నారన్నారు.

ప్రతి ఒక్కరూ తాము అనుసరించే విధానాల్లో పారదర్శకత ఉందా? లేదా? అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని  అన్నారు. ఉచితాలపై ఇక్కడ చర్చకు తావేలేదని ఆమె పేర్కొన్నారు.

''ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగులంతా నిరసనకు దిగారు. రాయితీలు, ఉచితాలు సందర్భోచితం గా ఉండాలి. ఒకవేళ మీరు బడ్జెట్‌లో వాటిని పెడితే అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. మీకు ఆదాయం ఉంటే డబ్బులు ఇవ్వొచ్చు. విద్య, ఆరోగ్యం, రైతులకు పలు రాయితీలు వంటివి ఇవ్వడం న్యాయమైనవి.'' అని అన్నారు.  వాస్త‌వానికి నిర్మ‌ల‌మ్మ ఏ రాష్ట్రం అని చెప్పుకుండానే కామెంట్లు చేసినా.. మెజారిటీ ప్ర‌జ‌లు మాత్రం ఏపీ గురించే అని ఉంటార‌ని భావిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News