ఎంట్రీతోనే అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మలా

Update: 2019-07-05 06:41 GMT
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పాత కాంగ్రెస్ నెలకొల్పిన సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తోంది. కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సపరేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టేవారు. ఇప్పుడు దాన్ని బడ్జెట్ లో కలిపేశారు. ఇక పంచవర్ష ప్రణాళికలను తీసేసి నీతి అయోగ్ ను ఏర్పాటు చేశారు. ఇలా సంస్కరణల బీజేపీ.. ఈసారి బడ్జెట్ లోనూ తన మార్క్ చూపించింది.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. తొలిసారి ఓ మహిళా మంత్రిగా నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండడం అందరినీ ఆకర్సిస్తోంది.  అయితే భారీ వరాలు కురిపిస్తారనుకుంటున్న ఈ బడ్జెట్ పై దేశ ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు.

ఇక బడ్జెట్ సందర్భంగా పాత కాంగ్రెస్ సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా బుట్టదాఖలు చేయడం సంచలనంగా మారింది. మామూలుగా బడ్జెట్ ప్రతులను ఓ లెదర్ బ్యాగ్ లో తీసుకురావడం సంప్రదాయం. పాత బీజేపీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇలానే బ్యాగ్ లో తెచ్చేవారు. కానీ ఇప్పుడు నిర్మలా ఆ సంప్రదాయాన్ని మార్చేయడం విశేషం.

ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్ కు బయలు దేరిన తన చేతిలో తాజాగా బ్రీఫ్ కేసుకు బదులు ఎర్రటి వస్త్రంలో చుట్టిన భారత్ నాలుగు సింహాల రాజముద్రను ముద్రించిన పార్సిల్ తో రావడం అందరినీ ఆకట్టుకుంది. ఓ ఎరుపు రంగు వస్త్రంలో నిర్మలా ఈ బడ్జెట్ ను తీసుకురావడం  విశేషంగా మారింది.
Tags:    

Similar News