తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? అన్న ప్రశ్నను రాష్ట్ర అధికారపక్షం తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అవసరమైన సమయాల్లో రెండు పార్టీల మధ్య మిత్రత్వం నడుస్తూనే.. పంచ్ లు వేసుకోవటం చూస్తే.. ఇద్దరు బతకనేర్చినోళ్ల మధ్య రిలేషన్ మాదిరి అనిపించకమానదు. ఇటీవల కాలంలో కేంద్రం తమకు ఇచ్చిందేమీ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫైర్ అయిన వేళ.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లోక్ సభలో ప్రశ్నను సంధించారు.
దీనికి బదులిచ్చే క్రమంలో తనకు వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేదు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ.. ఆ రాష్ట్రం ఏర్పడిన 2014-15లో మిగులు రాష్ట్రమని.. ఇప్పుడు మాత్రం అప్పులు ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. గడిచిన ఆరేళ్లలో అప్పులు క్రమంగా పెరిగాయన్నారు.
ఆరేళ్లలో తెలంగాణకు పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు.. వెనుబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1916 కోట్లు.. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రూ.3853 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.51,298.84 కోట్లు.. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణకు తామిచ్చింది తక్కువేమీ కాదన్న విషయాన్ని చెబుతూనే.. తెలంగాణ ఏర్పడిన ఆరేళ్లలో అప్పుల పాలైన వైనాన్ని నిర్మలమ్మ చెప్పారని చెప్పాలి. ప్రశ్న అడిగిన కోమటిరెడ్డి.. సమాధానం చెప్పిన కేంద్రమంత్రి.. తమ ఉమ్మడి ప్రత్యర్థికి పడాల్సిన పంచ్ వేశారని చెప్పకతప్పదు.