మ‌రోసారి చిక్కుల్లో ప‌డిన నిర్మ‌లా సీతారామ‌న్!

Update: 2018-07-27 05:02 GMT
కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మ‌రోసారి అడ్డంగా బుక్ అయ్యారు. చేసింది మంచి పనే అయి ఉండొచ్చు. కానీ.. తాను చేసిన ప‌నిని ఆమె బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోవ‌టం.. అది కాస్తా వేరే వారి నోటి బ‌య‌ట‌కు రావ‌టంతో ఆమె ఇప్పుడు డిఫెన్స్ లో ప‌డ్డారు.

ఇప్ప‌టికే రాఫెల్ యుద్ధ విమానాల ఇష్యూలో ఇరాక‌టంలో ప‌డిన ఆమెకు తాజా వ్య‌వ‌హారం మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెచ్చేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఏపీతో పెట్టుకున్నోళ్లు ఎవ‌రూ బాగుప‌డ‌లేద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. ప్ర‌త్యేక హోదా ఎపిసోడ్ లో మోడీకి ద‌న్నుగా నిలిచేందుకు నిర్మ‌ల ప్ర‌ద‌ర్శించిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మోడీ స‌ర్కారుపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఈ తెలుగింటి కోడ‌లు ప్ర‌ద‌ర్శించిన ఆగ్ర‌హం తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేరు.

ఇంత‌కీ.. నిర్మ‌లను డిఫెన్స్ లో ప‌డేసిన ఇష్యూ ఏమిట‌న్న‌ది చూస్తే.. ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఎయిర్ అంబులెన్స్ ను త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం సోద‌రుడి కోసం ప్ర‌త్యేకంగా పంప‌టం ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మైంది. ఇలాంటి ఇష్యూలు గుట్టుగా సాగిపోతుంటాయి క‌దా?  మ‌రెలా బ‌య‌ట‌కు వ‌చ్చింది?  అందునా మోడీ హ‌యాంలో చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఉంది క‌దా?  లాంటి సందేహాలు అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆయ‌న కోరుకున్న‌ట్లే వార్త‌ల విష‌యంలో క‌నిపించ‌ని కంట్రోల్ ఉంది.

అయితే.. ఓపీఎస్ ఉత్సాహంతో చెప్పిన మాటే నిర్మ‌ల‌మ్మ కొంప ముంచిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లాను క‌లిసేందుకు ప‌న్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ.. త‌న సోద‌రుడి అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ర‌క్ష‌ణ శాఖ అధికారులు ఎయిర్ అంబులెన్స్ పంపార‌ని.. త‌న‌కీ సాయం చేసిన నిర్మ‌లా సీతారామ‌న్ కు థ్యాంక్స్ చెప్పేందుకు తాను ఢిల్లీ వెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ మాట‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. నిర్మ‌లాను ఇరుకున ప‌డేలా చేశాయి. ప్ర‌స్తుతం రాఫెల్ ఎపిసోడ్ న‌డుస్తూ ర‌క్ష‌ణ మంత్రి హోదాలో ఉన్న ఆమెను చిరాకు పెడుతున్న వేళ‌.. ఒక ప్ర‌ముఖుడి ఇంటి అవ‌స‌రం కోసం ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఎయిర్ అంబులెన్స్ వాడ‌తారా? అన్న ప్ర‌శ్నను ఆమెకు సంధిస్తున్నారు.

చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే లోపే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోవ‌టంతో ప‌న్నీర్ సెల్వంపై నిర్మ‌లా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. మంత్రిని క‌ల‌వ‌కుండానే ఓపీఎస్ తిరిగి చెన్నైకు వ‌చ్చేశారు. ఢిల్లీలో త‌న‌ను క‌లిసే వ‌ర‌కూ దూరంగా ఉండి.. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసి ఉంటే బాగుండేద‌ని నిర్మ‌లా భావించార‌ని.. అలా చేయ‌కుండా అన‌వ‌స‌ర వివాదానికి కార‌ణ‌మ‌య్యార‌న్న కోపంలో ఆమె ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ర‌క్ష‌ణ మంత్రి హోదాలో ఉన్న నిర్మ‌ల త‌న ప‌ద‌వికి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలంటూ డీఎంకే కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.  ఒక వ్య‌క్తి కోసం ర‌క్ష‌ణ శాఖ త‌న అంబులెన్స్ విమానాన్ని ఉప‌యోగించ‌ట‌మా? అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రాణం మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు సాయం చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. సాధార‌ణ పౌరుడి విష‌యంలో ఇలాంటి ఉత్సాహం చూపించ‌ని నేత‌లు.. ప్ర‌ముఖుడి ఇంటి వారి విష‌యంలో మాత్రం ఇలాంటివి చేయ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చూస్తుంటే.. నిర్మ‌లాకు బ్యాడ్ టైం న‌డుస్తున్న‌ట్లుందే!
Tags:    

Similar News