ఉల్లి ప్రస్తుతం బంగారుమయం అయిపోయింది. పసిడి మాదిరి రోజురోజుకి పైపైకి ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బ్రేక్ చేసి.. ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది ఉల్లి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా.. కిలో ఉల్లి.. 180 రూపాయలకు చేరింది. దీనితో ఉల్లి కోసే సమయంలో రావాల్సిన కన్నీళ్లు సామాన్యులకి కొనేటప్పుడే వస్తున్నాయి.దీనితో ప్రజలు ఇప్పట్లో ఉల్లి ని కొనేటట్టుగా కనపడటం లేదు. కానీ , ఉల్లి నిత్యావసరాలలో భాగం కావడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఇకపోతే ఈ ఉల్లి సెగలు తాజాగా పార్లమెంట్ ని కూడా కుదిపేసింది. లోక్ సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ ఉల్లి అంశాన్ని తీసుకొచ్చారు. ఉల్లి ధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకి ఇబ్బందిగా మారాయి. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని - నేను ఉల్లి - వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను అని ఆమె వివరించారు.
ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నిస్తే..నేను ఉల్లి ఎక్కువగా తినను , తమ ఇంట్లో ఉల్లిపాయలను అంతగా వాడబోమని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఉల్లిధరలు పెరిగిపోవడంతో సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియడం లేదని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అలాగే త్వరగా ఉల్లి ధరలు అందరికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.