తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బలం ఆయన మాటతీరు అనే సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన కామెంట్లు వివాద రూపం దాల్చుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రిపై కేసీఆర్ చేసిన కామెంట్లు ఆయనకు బూమరాంగ్ అయ్యాయి. కేసీఆర్ చేసిన కామెంట్ల విషయంలో ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంజాయషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ఎందుకు స్పందించడం లేదని మోడీని కేసీఆర్ నిలదీశారు. అయితే తనదైన శైలిలో ఆయన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నిర్మలా సీతారామన్ స్పందించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ నాల్గవ వర్ధంతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాను కేటీఆర్‌ను నిలదీస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరూ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన పదవుల్లో ఉన్నారని పేర్కొంటూ ప్రధానమంత్రి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించిన పదజాలం నాకు నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు. సిద్దాంతం పరంగా వైరుధ్యాలంటే... దానిపై విమర్శలు చేస్తే వినేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెబితే వినవచ్చు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నవారు అలా మాట్లాడటం సరికాదని తేల్చిచెప్పారు.
బోయింగ్- టాటా కంపెనీ కార్యక్రమానికి హాజరయ్యే ముందు కేసీఆర్ వ్యాఖ్యల గురించి తాను సీఎం కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్‌ను నిలదీశానని నిర్మలా సీతారామన్ తెలిపారు. `ప్రధానమంత్రి గురించి కేసీఆర్ అనుచితంగా మాట్లాడిన తర్వాత తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుండదని కేటీఆర్ కు చెప్పాను. నేను రావాలా వద్దా అని కేటీఆర్ ను ప్రశ్నించాను. మా నాన్న అలా మాట్లాడుతారని నేను అనుకోను... అని కేటీఆర్ అన్నారు. చాలా వివరంగా సమాదానం ఇచ్చారు... కాబట్టే ఇవాళ నేను వచ్చాను. సభా వేదికపై కూడా కేటీఆర్ ను నిలదీశాను. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలు మా అందరికీ చాలా బాధ కలిగించాయి. దీనిపై వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఇది పద్దతి కాదు` అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.