వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సలహా దారులు కోకొల్లలు గా ఉన్నారు. ప్రతి విషయానికీ ఆయన కు సలహాలు ఇచ్చేందుకు ఎందరో ఉన్నారు. అయితే, తాజాగా మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాలను చూసిన తర్వాత జగన్ కు సలహాలు ఇచ్చేవారి కన్నా కూడా వ్యూహ కర్తలే ఎక్కువ గా అవసరమేమో..! అనే సందేహాలు తెర మీదికి వచ్చాయి. దీనికి ప్రధాన కారణం.. సభలో వైసీపీ తరపున సరైన గళం వినిపించక పోవడమే..!! అంటే ఒకింత ఆశ్చర్యంగా ఉండి ఉండొచ్చు. కానీ, ఇది నిజమని అంటున్నారు పరిశీలకులు. సభలో అంకెలు వల్లెవేయడం, లోటు పాట్లు చర్చించడం, నువ్వు అది చేశావ్.. అంటే నేను ఇది చేశానని చెప్పుకోవ డం వరకు కామనే.
అయితే, అసలు సిసలు వ్యూహం అనేదే ముఖ్యంగా ఈ విషయం లో వైసీపీ లో లోటు స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యూహాత్మకం గా మంగళవారం నాటి సభలో వ్యవహరించారు. హెరిటేజ్ సంస్థలో ఉల్లిపాయలను రూ.200లకు విక్ర యిస్తున్నారంటూ అధికార పక్షం దాడి చేసినప్పుడు.. అది అసలు తనదే కాదని చెప్పారు. అంతేకాదు.. తనది అని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనది కాక పోతే.. సీఎంగా జగన్ రాజీనామా చేయాలని ఆయన సవాల్ రువ్వారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.
ఈ సవాల్ ను తిప్పి కొట్టడంలోను, వ్యూహాత్మకంగా వ్యవహరించి చంద్రబాబు కోర్టు లోకి బంతిని విసరడం లోనూ వైసీపీ నాయకులు ఫెయిలయ్యారనేది ప్రధాన వాదన. నిజానికి హెరిటేజ్ పై తర్వాత చర్చను కొనసాగించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. హెరిటేజ్ లో చంద్రబాబుకు 3.5 శాతం షేర్లు ఉన్నాయని నిరూపించారు. దీనిని తర్వాత చంద్రబాబు సైతం అంగీకరించారు. కానీ, ఇంతలోనే అంబటి రాంబాబు మైకు అందుకో వడంతో పూర్తి చర్చ పక్కదారి పట్టింది. దీంతో బాబు రువ్విన సవాల్ పై చర్చ ఎక్కడా కనిపించ లేదు. ఇలాంటి విషయాల్లోనే సీనియర్ల పనితనం ఎక్కువగా కనిపించాలి.
వైసీపీ లో సీనియర్లు ఉన్నా కూడా బాబు తప్పును ఎత్తి చూపడం, సవాల్‌కు ప్రతిసవాల్ రువ్వడం వంటివి లేకపోవడం, అక్కడికక్కడ నిరూపించినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో వ్యూహాత్మకంగా వైసీపీ తరపున వ్యవహరించేవారు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఉన్న నాయకులు కూడా వ్యూహాత్మకం గా వ్యవహరించడంలో చురుగ్గా వ్యవహరించ లేక పోతున్నారు. పైగా జగన్ అంటే బెరుకు కూడా ఉండడం పెద్ద మైనస్‌గా మారి పోయింది. మరి ఈ విషయంలో జగనే చొరవ తీసుకుని సభలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. మంచిదనేది పరిశీలకుల మాట.