అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే.. చొచ్చుకెళ్లే కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రాంతాలు ప్రపంచంలో ఇప్పుడు చాలా.. చాలా తక్కువని చెప్పాలి. సముద్రం మధ్యలో ఉన్న బుల్లి దేశాల్లోనూ.. ప్రపంచంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకుండా.. తమ బతుకులు తాము బతికే దేశాల్లో మాత్రమే కరోనా లేదు. అయితే.. ఇలాంటివి వేళ్ల మీద లెక్క బెట్టే మాత్రంగానే ఉన్నాయి. ఇక.. పెద్ద దేశాలు కరోనా ధాటికి వణికిపోతున్న దుస్థితి. ప్రపంచానికి పెద్దన్న అమెరికా తాజా పరిస్థితి మరెంత దారుణంగా ఉందో తెలిసిందే.
ఆ దేశం బాటలోనే ప్రపంచంలోని పలు దేశాలు ఉన్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే.. 134 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉండదని చెప్పాలి. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నా.. నియంత్రించే స్థాయిలోనే అవన్నీ ఉన్నాయని చెప్పక తప్పదు. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ కేసుల నమోదు అవుతున్నా.. నియంత్రించే స్థాయిలోనే ఉండటం గమనార్హం.
ఇలాంటివేళ.. కరోనా పాజిటివ్ కేసు ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాని రాష్ట్రం ఏదైనా ఉందా? అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. అందునా.. నిత్యం పర్యాటకులతో కళకళలాడే రాష్ట్రంలో.. కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాని బుల్లి రాష్ట్రంగా గోవా మారింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా నెలకొన్న పరిస్థితులతో.. తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేసి.. రోజువారీ కార్యకలాపాల్ని పునరుద్దరించారు. మొత్తంగా చూస్తే.. దేశంలో కరోనా లేని స్వర్గం ఎక్కడైనా ఉందంటే.. అది గోవానే కావటం గమనార్హం.