ప్రభుత్వాలు వస్తుంటాయి .. పోతుంటాయి..! కానీ ఇక్కడ కంగన పర్మినెంట్. నేను లోకల్.. చంటి గాడు తరహా కంగన రనౌత్ అంటే! నమ్మాలి. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన కంగన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. కొత్త సీఎంకి వెల్ కం చెబుతూ.. ఇప్పుడు మనం భయం లేకుండా జీవించగలం! అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.
నిజానికి గత ఏడాది అంతా కంగన వర్సెస్ సేన వార్ గురించి తెలిసిందే. ముంబై నగరంలో కంగనను గత మహా ప్రభుత్వం బోలెడంత టార్చర్ చేసింది. తన ఆఫీస్ భవంతిని కూడా తప్పుడు కట్టడం అంటూ కూల్చివేసే ప్రయత్నం చేసింది. దానిపై కంగన న్యాయపోరాటం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై క్వీన్ ఎంతో ధైర్యంగా కౌంటర్లు వేసింది. తన స్వస్థలం హిమచల్ ప్రదేశ్ తో పోలిస్తే మహారాష్ట్రలో బతకడం చాలా కష్టమని కూడా అప్పట్లో స్టేట్ మెంట్లు ఇచ్చింది. ప్రజలు భయాందోళనలతో బతకాల్సి వస్తోందని కూడా కంగన అంది.
కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు మహా ప్రభుత్వం లో మార్పులకు స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయగా కొత్త గా పీఠంపైకి వచ్చిన వారిని కంగన పొగిడేస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏది అయినా జరగొచ్చనడానికి ఇది నిదర్శనమని కంగన అంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఏక్నాథ్ షిండే జూన్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే సిన అనంతరం దీనిపై స్పందించిన కంగనా రనౌత్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అతనికి అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకుడిగా షిండే ప్రయాణాన్ని ప్రశంసిస్తూ.. ఎంతో స్పూర్తిదాయకమైన విజయగాథ ఇది అని పొగిడేసింది. జీవనోపాధి కోసం ఆటో రిక్షా నడపడం నుండి దేశంలో అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన వ్యక్తిగా నాయకుడిగా ఎదగడం వరకు... అభినందనలు సార్ అని ఇన్ స్టాలో రాసింది. కంగనతో పాటు ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్ నాథ్ షిండే - దేవేంద్ర ఫడ్నవీస్ లను అభినందించారు. ఆయన ట్వీట్ చేస్తూ డైనమిక్ నాయకులకు అభినందనలు. కనీసం ఇప్పుడు మనం భయం లేకుండా జీవించగలం. #జై మహారాష్ట్ర అని మద్ధతు పలికారు.
క్వీన్ కంగనపై ఇక ఎటాక్ లు ఉండవా? అంటూ థాక్రేల ఇష్టం. భాజపా కూడా బలం పెంచుకుంది కాబట్టి కంగనకు అట్నుంచి ఎప్పుడూ మద్ధతు ఉంటుంది. అయినా కంగన కెరీర్ పై దృష్టి సారించకుండా ఇలా రాజకీయాల్ని కెలుకుతూ ఉండడం ఎంతవరకూ కరెక్ట్? వరుసగా భారీ డిజాస్టర్లతో కెరీర్ పరంగా దిగజారిపోయిన కంగనకు ఇవన్నీ అవసరమా? అని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు.
అయితే నేటి సమాజంలో బతకాలంటే కనీస మాత్రంగా అయినా రాజకీయ నాయకుల అండదండలు ఉండాలి. ఈ విష వలయంలోకి వెళ్లొద్దు అనుకున్నా ఏదో ఒక సందర్భం అటు లాగుతుంది. ముంబై పరిశ్రమలో కొనసాగుతున్నంత కాలం కంగన లోకల్. అక్కడ తనకు అండదండలు కావాల్సిందే. లేదంటే తన వివాదాస్పద వైఖరికి కచ్ఛితంగా ముప్పు తిప్పులు ఉంటాయ్.