జగన్ బొమ్మ అక్కడా గాయబ్ !
అదే తెల్ల రేషన్ కార్డుల మీద అని తెలుస్తోంది. ఏపీలో దాదాపుగా కోటీ యాభై లక్షల దాకా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతీ పధకం మీద ప్రతీ సర్వే రాయి మీద జగన్ బొమ్మ వేసుకున్నారని టీడీపీ కూటమి నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. ఆఖరుకు పట్టాదారు పాసుపుస్తకాల మీద జగన్ బొమ్మ పెట్టారని కూడా మండిపడ్డారు. ఇలా వరసబెట్టి జగన్ బొమ్మను ప్రతీ చోటా తొలగిస్తున్నారు. అదే వరసలో మరో దాని మీద తొలగించనున్నారు అని అంటున్నారు.
అదే తెల్ల రేషన్ కార్డుల మీద అని తెలుస్తోంది. ఏపీలో దాదాపుగా కోటీ యాభై లక్షల దాకా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిని వైసీపీ పార్టీ కలర్స్ అయిన నీలి రంగుతో కలిపి ముద్రించారు. ఇక జగన్ బొమ్మ కూడా వాటి మీద ఉంది. అఫ్ కోర్స్ 2014 నుంచి 2019 దాకా పాలించిన టైం లో పసుపు కలర్ తో చంద్రబాబు బొమ్మతో తెల్ల రేషన్ కార్డులు ఉండేవి.
వాటిని జగన్ మార్చేసి తమ బొమ్మతో వేశారు అని చెబుతారు. ఇపుడు వాటిని మార్చడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా చౌక దుకాణాలలో జగన్ బొమ్మతోనే రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి మీదనే సరుకులు పంపిణీ చేస్తున్నారు.
దాంతో కొత్త ఏడాది సంక్రాంతి తరువాత ప్రభుత్వం కొత్త కార్డులను పంపిణీ చేస్తుందని అంటున్నారు. అంతే కాదు గతంలో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న అనేకమందికి తెల్ల రేషన్ కార్డులు రాలేదని అంటున్నారు. అంతే కాదు అనర్హులు చాలా మంది కార్డులు పుచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
దాంతో తెల్ల రేషన్ కార్డులను కొత్తగా అర్హులైన వారికి ఇచ్చేందుకు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు అని అంటున్నారు. ఆ మీదట గ్రామ సభలు నిర్వహించి అర్హులను అక్కడ నిర్ణయిస్తారు అని అంటున్నారు. అలాగే అనర్హులను కూడా తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతుంది అని అంటున్నారు.
ఇప్పటికీ వైట్ కార్డులు ఉంచుకుని సరకులు తీసుకోకుండా ఉంటున్న వారి సంఖ్య వేలల్లో ఉందిట. వాటిని ముందు కట్ చేసి ఆ మీదట పేదల అర్హతలను నిర్ణయించి వాటికి సరిపోయే వారినే తెల్లకార్డుదారులుగా గుర్తిస్తారు అని అంటున్నారు. ఈ మొత్తం తతంగం పూర్తి చేయడంతో పాటు కొత్తగా కూటమి ప్రభుత్వం కార్డులను ముద్రించి ఇస్తుందని వాటి మీద జగన్ బొమ్మ తొలగిస్తుందని అంటున్నారు.
మొత్తానికి చూస్తే సంక్రాంతి తరువాత కొత్త కార్డులు రాబోతున్నాయి. అదే విధంగా ఈసారి వచ్చే కార్డులలో చంద్రన్న బొమ్మ ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. వైట్ కార్డుల మీద జగన్ బొమ్మ తొలగిస్తే ఏపీలో జగన్ ముద్ర పూర్తిగా ప్రభుత్వం పధకాల మీద తొలగినట్లే అని అంటున్నారు.